KTR : రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పాదయాత్రలు చేసి ప్రజలకి దగ్గరై విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు.పాదయాత్ర.. ఇది పాదాలతో చేసే యాత్ర. అప్పుడెప్పుడో వైఎస్ షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. చాలామంది ఈ పాదయాత్ర ఫార్ములాని వాడేశారు. కానీ, సరైన టైమ్‌లో వాడి సక్సెస్ అయినవాళ్లు కొందరే. పాదయాత్ర చేద్దాం అని అనుకుంటే సరిపోదు. దానికి అన్ని రకాల తోడ్పాటు, సరైన సమయం ఉండాలి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.
దగ్గరలో ఎన్నికలు లేవు. ఇలాంటి సమయంలో ఈ డెసిషన్‌కు కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న చుట్టూ అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి.క్యాడర్ కోరిందా లేక కేటీఆర్ కి ఈ ఆలోచన వచ్చినా అది చాలా పాతబడిపోయిన రాజకీయ ప్రయోగం అని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణా అస్తవ్యస్తం అయింది అని కేటీఆర్ అంటున్నారు. ప్రజల తరఫున తాము పోరాటాలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా పాదయాత్ర అంటున్నారు. దయాత్ర ప్రకటనలు చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు కాదు మోకాళ్ల యాత్రలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇద్దరు నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డివన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని వ్యాఖ్యానించారు. దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు రెండూ ఒక్కటేనని.. దొందూ దొందేనని తెలిపారు.
కేసీఆర్ బహుశా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. కేవలం, పరోక్ష సహకారం మాత్రమే అందిస్తారని అంటున్నారు. దీనిపై చర్చ జరిగాకే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసి ఉంటారని తెగ మాట్లాడుకుంటున్నారు. అంటే, నెక్ట్స్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేలా ఫోకస్ అయ్యేందుకు పాదయాత్ర దోహదపడుతుందని, కారు పార్టీ మొత్తం తన గ్రిప్‌లోకి వస్తుందని భావించే పాదాల యాత్రకు దిగుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. 2027లో జమిలీ ఎన్నికలు ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఎంత వీలుంటే అంత త్వరగా పాదయాత్ర మొదలుపెట్టి, పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని కేటీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.