Bigg Boss Arjun try for sri satya
Bigg Boss Arjun : బిగ్ బాస్ 6 తెలుగు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈజీగా అర్థమయిపోతున్న విషయం శ్రీ సత్య మాయలో అర్జున్ కళ్యాణ్ ఉన్నాడని..! ఎందుకంటే ఆయన మొదటివారం నుంచి చేస్తున్న పని ఒకటే.. ఆట ఆటడం మానేసి పూర్తిగా శ్రీ సత్య మాయలో పడిపోయాడు. ఎప్పుడెప్పుడు ఆమె తన ప్రేమను ఒప్పుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే అలాంటి పప్పులు తన దగ్గర ఉడకవు అని శ్రీ సత్య ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్న.. అర్జున్ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. అనవసరంగా ఆమె చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా.. గేమ్ పై కూడా కాన్సెంట్రేట్ చేయట్లేదు. ఇదే విషయం ఈ వారం నాగార్జున దగ్గర ఇంటి సభ్యులు కూడా చెప్పారు. మెడలో కుక్క తోక వంకర, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు అనే సామెతలు కూడా వేశారు.అసలు ఇంతగా శ్రీ సత్యను అర్జున్ గోకుతున్న ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదంటే..?
టైటిల్ కొడతా.. నేనేంటో చూపిస్తా అంటూ బిగ్ బాస్ షో మొదలైనప్పుడు ఎన్నో గొప్పలు చెప్పాడు అర్జున్ కళ్యాణ్. కానీ ఆయన ఆటతీరు చూస్తుంటే మాత్రం ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. కేవలం శ్రీ సత్యని ట్రై చేయడానికి మాత్రమే ఆయన ఇంటికి వచ్చినట్టు అర్థం అవుతుంది. బయట ఇద్దరు కలవడానికి టైం పెద్దగా దొరకనట్టుంది.. అందుకే ఇంట్లో ఇక్కడ ఎవరూ ఉండరు కాబట్టి హాయిగా తన ట్రయల్స్ వేసుకోవచ్చు అని.. శ్రీ సత్య వెంట పడడానికి బిగ్ బాస్ వాళ్ళను ఒప్పించి మరీ ఇంట్లోకి అర్జున్ అడుగుపెట్టడేమో అనిపిస్తుంది. మరోవైపు ఈయనను గేమ్‌లో ఎలా వాడుకోవాలో శ్రీ సత్యకు ఉన్నంత క్లారిటీ మరెవరికీ లేదేమో..? గతవారం ఇచ్చిన టాస్కులో ఉన్న డబ్బులన్నీ ముందు అర్జున్ నుంచే లాగేసుకుని.. హాయిగా టాప్‌లో వెళ్లి కూర్చుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంట్లో అందరి కంటే ఎక్కువ కక్కుర్తి రాజాగా పేరు తెచ్చుకుంటున్నాడు అర్జున్ కళ్యాణ్. టాస్క్ అనే విషయం కూడా పూర్తిగా మర్చిపోయి శ్రీ సత్య ముందు కుక్కపిల్లలా ఆడేస్తున్నాడు.
Bigg Boss Arjun try for sri satya
అర్జున్ కళ్యాణ్ ఇంత ట్రై చేస్తున్నా.. శ్రీ సత్య మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తనను మనోడు ట్రై చేస్తున్నాడు అనే విషయం పూర్తిగా అర్థమై కూడా పట్టించుకోనట్టు ఉంది.. పైగా తన లైఫ్లో బయట జరిగిన కొన్ని విషయాలు ఇంట్లో వాళ్లకు చెబుతూ.. తాను ఎవరికీ దగ్గర కాలేనని.. ఒకవేళ వచ్చినా దూరమవుతున్నప్పుడు తన తప్పు మాత్రం ఉండదు అని క్లారిటీగా చెప్పేస్తుంది. తనకు ఫ్రెండ్స్ ఎవరు అక్కర్లేదని.. జీవితంలో ఒక్కదాన్నే ఉండడానికి సిద్ధమైపోయి ఇంట్లోకి వచ్చానని.. బయటకు వెళ్లిన తర్వాత కూడా తనకు ఎవరు అవసరంలేదని కరాకండిగా చెప్తుంది. అర్జున్ కళ్యాణ్ ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆమె మూడు నాలుగు సార్లు ఇప్పటికే కూర్చోబెట్టి మరి తన వెంట పడొద్దు.. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు.. గేమ్ మీద ఫోకస్ చేయాలని చెప్తుంది నా లైఫ్‌లో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు అంటూ శ్రీసత్య చెప్పేసింది. ఇంత తెలిసినా కూడా అర్జున్ కళ్యాణ్ మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు. మరి ఇది చివరి వరకు ఎలా మారబోతుందో చూడాలి.
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
This website uses cookies.