
bigg boss contestant Geetu Royal got offered in Pawan Kalyan movie
Geetu Royal : బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గీతూ రాయల్. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతూ పేరు బిగ్ బాస్ ఆడియన్స్ లో మారుమొగింది. తొలివారాలలో ఎవ్వరు పెద్దగా గేమ్ ఆడని టైంలో గీతూ… ఆటతీరు షోపై ఇంట్రెస్ట్ కలిగించేలా చేసింది. అయితే ఈ క్రమంలో ఆమె ఇతర ఇంటి సభ్యులపై నోరు పారేసుకోవటం … ఆమె గేమ్ మొత్తానికి మైనస్ అయింది. అంత మాత్రమే కాదు వెళ్ళిపోక ముందు కొద్ది వారాలుగా ఆమె బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో గేమ్ ముందుకెళ్లకుండా అట్టర్ ఫ్లాప్ లుప్స్…ఇతరుల గేమ్ కూడా చెడగొట్టే రీతిలో ఉండటంతో…
9వ వారం నామినేషన్ లో గీతూనీ ఓటింగ్ ద్వారా ఆడియన్స్ బయటకు పంపేలా చేశారు. ఏమాత్రం ఊహించని రీతిలో ఎలిమినేట్ కావటంతో గీతూ భయంకరంగా ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా వేదికపై నాగార్జునతో.. బయటకు వచ్చాక లైవ్ లో కూడా ఏడుస్తూనే ఉంది. తన ఎలిమినేషన్ ని అంగీకరించలేకపోతోంది. అయితే ఇటువంటి తరుణంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన గీతూకి బంపర్ ఆఫర్ ఇండస్ట్రీలో తగిలినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే “భగత్ సింగ్ భావదీయుడు” సినిమాలో…
bigg boss contestant Geetu Royal got offered in Pawan Kalyan movie
గీతూనీ తీసుకోవడానికి హరీష్ శంకర్ రెడీ అయినట్లు బయట ప్రచారం జరుగుతుంది. సినిమాలో ఇది సీరియస్ రోల్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో దగ్గర అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. పైగా గీతూ … కామెడీ టైమింగ్ తో పాటు చిత్తూరు యాస భాషలో… ఇరగదీస్తూ ఉంటది. దీంతో గీతూ కెరియర్ పరంగా ఇంకా వెనక్కితిరిగి చూసుకో అక్కర్లేదంటూ తాజా వార్తపై నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ సినిమా మాత్రమే కాదు “పుష్ప 2″లో కూడా గీతూకి అవకాశం వచ్చినట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయితే ఇంకా గీతూకి తిరుగుండదని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.