Geetu Royal : ఎలిమినేట్ అయిన గీతూ రాయల్… పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..?

Authored By Breaking News | The Telugu News | Published on: November 11, 2022, 1:40 pm

Geetu Royal : బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గీతూ రాయల్. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతూ పేరు బిగ్ బాస్ ఆడియన్స్ లో మారుమొగింది. తొలివారాలలో ఎవ్వరు పెద్దగా గేమ్ ఆడని టైంలో గీతూ… ఆటతీరు షోపై ఇంట్రెస్ట్ కలిగించేలా చేసింది. అయితే ఈ క్రమంలో ఆమె ఇతర ఇంటి సభ్యులపై నోరు పారేసుకోవటం … ఆమె గేమ్ మొత్తానికి మైనస్ అయింది. అంత మాత్రమే కాదు వెళ్ళిపోక ముందు కొద్ది వారాలుగా ఆమె బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో గేమ్ ముందుకెళ్లకుండా అట్టర్ ఫ్లాప్ లుప్స్…ఇతరుల గేమ్ కూడా చెడగొట్టే రీతిలో ఉండటంతో…

9వ వారం నామినేషన్ లో గీతూనీ ఓటింగ్ ద్వారా ఆడియన్స్ బయటకు పంపేలా చేశారు. ఏమాత్రం ఊహించని రీతిలో ఎలిమినేట్ కావటంతో గీతూ భయంకరంగా ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా వేదికపై నాగార్జునతో.. బయటకు వచ్చాక లైవ్ లో కూడా ఏడుస్తూనే ఉంది. తన ఎలిమినేషన్ ని అంగీకరించలేకపోతోంది. అయితే ఇటువంటి తరుణంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన గీతూకి బంపర్ ఆఫర్ ఇండస్ట్రీలో తగిలినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే “భగత్ సింగ్ భావదీయుడు” సినిమాలో…

bigg boss contestant Geetu Royal got offered in Pawan Kalyan movie

bigg boss contestant Geetu Royal got offered in Pawan Kalyan movie

గీతూనీ తీసుకోవడానికి హరీష్ శంకర్ రెడీ అయినట్లు బయట ప్రచారం జరుగుతుంది. సినిమాలో ఇది సీరియస్ రోల్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో దగ్గర అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. పైగా గీతూ … కామెడీ టైమింగ్ తో పాటు చిత్తూరు యాస భాషలో… ఇరగదీస్తూ ఉంటది. దీంతో గీతూ కెరియర్ పరంగా ఇంకా వెనక్కితిరిగి చూసుకో అక్కర్లేదంటూ తాజా వార్తపై నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ సినిమా మాత్రమే కాదు “పుష్ప 2″లో కూడా గీతూకి అవకాశం వచ్చినట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయితే ఇంకా గీతూకి తిరుగుండదని అంటున్నారు.

 

Breaking News

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp