అదే బెస్ట్ పార్ట్.. బిగ్ బాస్ దివి కామెంట్స్

0
Advertisement

Bigg Boss Divi బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఎవరైనా అదృష్టవంతురాలు ఉన్నారా? అంటే అది కచ్చితంగా దివినే. వచ్చిన రెండు మూడు రోజులు ఒక్క మాటైనా మాట్లాడకుండా.. రెండు మూడు ఎపిసోడ్‌లో కనీసం ఒక్క రెండు నిమిషాలైనా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. కానీ ఆ తరువాత దివికి వచ్చిన క్రేజ్ చూసి అందరూ ఫిదా అయ్యారు. దివి అందాలకు, హోయలకు నెటిజన్లు షాక్ అయ్యారు. ఇక దివిని ఓవర్ నైట్ స్టార్ చేసేశారు.

అలా బిగ్ బాస్ షో కంటే ముందు చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేసిన దివికి Bigg Boss Divi ఇప్పుడు భారీ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ దివికి ఎన్నో ప్రాజెక్ట్‌లు కన్ఫామ్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు దివి క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహర్షి సినిమా చేస్తున్న సమయంలోనే ఈ మూవీ అవకాశం వచ్చిందని దివి చెబుతోంది. అయితే బిగ్ బాస్ తరువాత జీవితం మొత్తం మారిందని అంటోంది.

Bigg Boss Divi
Bigg Boss Divi

Bigg Boss Divi అదే బెస్ట్ పార్ట్.. బిగ్ బాస్ దివి కామెంట్స్

బిగ్ బాస్ తరువాత నా జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా మారింది.. ఒకప్పుడు నన్ను పక్కన పెట్టేసిన వాళ్లే.. ఇప్పుడు గౌరవిస్తున్నారు.. ఎన్నో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అన్నింటి కంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే.. చిరంజీవి మెహర్ రమేష్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర వచ్చిందని చెప్పుకొచ్చింది.

Advertisement