Bigg Boss Non Stop : మొదటి వారం నామినేషన్స్.. అరియానా, నటరాజ్ మాస్టర్ ను టార్గెట్ చేసిన చాలెంజర్స్

Authored By Varun G | The Telugu News | Published on: February 28, 2022, 2:00 pm

Bigg Boss Non Stop : బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రారంభం అయిన రెండు రోజుల్లోనే బీభత్సమైన కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. నిజానికి.. ఈ సీజన్ చాలా డిఫరెంట్. ఎందుకంటే.. రెండు గ్రూపుల మధ్య జరిగే యుద్ధమే ఈ ఓటీటీ సీజన్. 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో లైవ్ లో చూసే అవకాశం ఉంది. అయితే.. మొదటి వారం నామినేషన్స్ ప్రారంభం అయ్యాయో లేదో.. వారియర్స్, చాలెంజర్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది.

bigg boss non stop nominations started with a twist

bigg boss non stop nominations started with a twist

నిజానికి.. వారియర్స్ ఇప్పటికే పాత సీజన్లలో పార్టిసిపేట్ చేశారు. వాళ్లకు చాలా అనుభవం ఉంది. చాలెంజర్స్ కొత్తగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అయినప్పటికీ వారియర్స్ ను.. చాలెంజర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. మొదటి వారం నామినేషన్లలో చాలెంజర్లు చాలా క్లారిటీతో వారియర్స్ ను నామినేట్ చేశారు.

Bigg Boss Non Stop : చైతు, మిత్ర శర్మను డైరెక్ట్ గా నామినేట్ చేసిన ఇంటి సభ్యులు

వారియర్స్ లో ఎక్కువగా చాలామంది సరయు, అరియానా, నటరాజ్ మాస్టర్ ను టార్గెట్ చేశారు. చాలామంది నట్ రాజ్ మాస్టర్ ను నామినేట్ చేశారు. ఆ తర్వాత సరయును ఎక్కువ మంది నామినేట్ చేశారు. చాలెంజర్స్ అందరితో నట్ రాజ్ మాస్టర్ గొడవ పెట్టుకున్నాడు. అందరూ నన్ను ప్లాన్ చేసి బయటికి పంపిద్దామనుకుంటన్నారా? అని అంటాడు నట్ రాజ్ మాస్టర్.

మరోవైపు మొదటి వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు ఇద్దరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరుతాడు. దీంతో ఆర్జే చైతూ, మిత్ర శర్మను బిగ్ బాస్ కు చెబుతారు. దీంతో చైతూ, మిత్ర శర్మతో పాటు.. నట్ రాజ్ మాస్టర్, అరియానా, సరయు, హమిదా, ముమైత్ ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయ్యారు.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp