Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్ ఓటీటీ తెలుగు లో అతి తక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్ ఓటీటీ తెలుగు లో అతి తక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా?

 Authored By prabhas | The Telugu News | Updated on :7 May 2022,10:00 am

Bigg Boss OTT Telugu : భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన తెలుగు బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ ఓటీటీ వర్షన్‌ కు మంచి స్పందన వచ్చింది. మొదట్లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అంటూ ప్రచారం చేశారు. దాన్ని జనాలు పట్టించుకోవడం లేదు. పైగా లైవ్ స్ట్రీమింగ్‌ వల్ల ప్రయోజనం శూన్యం అంటూ వెళ్లడి అయ్యింది. అందుకే మద్య లో ఆపేశారు. మళ్లీ మొదలు పెట్టినా కూడా జెన్యూన్‌ గా లైవ్‌ ఇవ్వడం లేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే షో ముగింప దశకు వచ్చింది. ప్రస్తుం షో లో ఉన్న వారి పారితోషికాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న వారిలో అత్యధికంగా పారితోషికంను అఖిల్, బిందు మాధవి, అరియానా మరియు అషు రెడ్డిలు తీసుకుంటూ ఉన్నారు. బాబా మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ లు ఒక మోస్తరు పారితోషికంను అందుకుంటూ ఉన్నారు. ఇక మిత్ర పారితోషికమే తీసుకోవడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆమె కు ఒక్క వారం కు 1.25 లక్షలు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఇక యాంకర్ శివ మరియు అనీల్‌ ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

very less remuneration contestant in Bigg Boss OTT Telugu nonstopews

very less remuneration contestant in Bigg Boss OTT Telugu nonstopews

శివ ఇస్తున్న ఎంటర్‌ టైన్మెంట్‌ నేపథ్యంలో ముందుగా అనుకున్న పారితోషికం కంటే కాస్త ఎక్కువ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక అనీల్ కు అందరి కంటే తక్కువగా వారంకు లక్ష రూపాయల పారితోషికం మాత్రమే ఇస్తున్నారట. అయినా అనీల్‌ ఇన్ని వారాలు ఉంటాడని ఏ ఒక్కరు భావించలేదు. తన కూల్ అండ్ కామ్‌ గోయింగ్‌ పర్శనాలిటీతో ఇన్నాళ్లు నెట్టుకు వచ్చాడు. తక్కువ పారితోషికం అయినా ఇన్నాళ్లు షో లో ఉండటం వల్ల మంచి లాభమే అనీల్ కు దక్కింది. మోడల్‌ అయిన అనీల్‌ కు బిగ్‌ బాస్ ఫేమ్‌ తప్పకుండా ఉపయోగపడుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది