Home » Entertainment » Bigg Boss Ott List Released
Entertainment

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీకి అంతా సిద్ధం.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్.. కొత్తోళ్లు ఎవ‌రు, పాతోళ్లు ఎవ‌రు?

Authored By
Sam C
The Telugu News | Published on: February 17, 2022, 10:00 am
Advertisement

Bigg Boss OTT : తెలుగు వినోద రంగంలో తొలిసారి ఓటీటీ ద్వారా బిగ్‌బాస్ రియాలిటీ షోను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ముందుగా తమిళంలో ఓటీటీ షో ప్రారంభం కానున్నది. ఆ తర్వాతే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్ప‌టికే హిందీలో ప్రారంభ‌మై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్‏టైన్‏మెంట్ అందించేందుకు తెలుగు బిగ్‏బాస్ ఓటీటీని తీసుకురాబోతున్నట్లుగా గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు. బిగ్‏బాస్ ఓటీటీ తెలుగు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. బిగ్‏బాస్ ఓటీటీకి నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు.

Advertisement

బిగ్ బాస్ ఓటీటీ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌కి సంబంధించి కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తూనే ఉంది. ఇందులో కొంద‌రు కొత్త వాళ్లు, మ‌రి కొంద‌రు పాత సీజ‌న్స్‌లో పాల్గొన్న‌వాళ్లు ఉంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ లిస్ట్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కనీసం ఇద్దరేసి కంటెస్టెంట్లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సోషల్ మీడియా స్టార్స్, యూట్యూబర్స్ ఇలా రకరకాల ఫీల్డ్ లో ఫేమస్ అయినవారు పాల్గోనబోతున్నారు.

bigg boss ott list released

Advertisement

Bigg Boss OTT : ఇది ఫైన‌ల్ లిస్టేనా?

ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నారు. అలాగే యూట్యూబర్ నిఖిల్, యాంకర్ శివ, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతూ, మిస్టర్ ఇండియా 2021 మోడల్ అనిల్ రాథోడ్, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ, నటి.. మోడల్ మిత్రా శర్మ ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే ఇందులో కచ్చితంగా ఎవరెవరు పాల్గోననున్నారో తెలియాలంటే ఈనెల 26 వరకు ఆగాల్సిందే. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ ఓటీటీని భారీగానే ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి