Karthika Deepam 17 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 1278 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత హాస్పిటల్ బోర్డును వారణాసి చింపేసి వెళ్లడంతో బస్తీ వాసులు టెన్షన్ పడతారు. మోనిత మేడమ్ కు ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని లక్ష్మణ్ బస్తీ వాసులతో అంటాడు. ఇంతలో మోనిత కారు వచ్చి ఆగుతుంది. ఏంటి.. నా ఇంటి ముందు ఇంత మంది జనం ఉన్నారు. బాబాయి కొంపదీసి పోయాడా అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది. బోర్డు నాశనం అయి ఉండటాని చూస్తుంది మోనిత. ఏమైంది లక్ష్మణ్ అని అడుగుతుంది. అమ్మా మోనిత అని వస్తాయి బాబాయి. హమ్మయ్య ముసలోడు సేఫ్ అని అనుకుంటుంది. లక్ష్మణ్.. జరిగిందంతా చెబుతాడు.
పాపం వంటలక్క అని బోర్డు పెట్టగానే దీపక్కకు కోపం వచ్చి ఉంటుందేమో. బోర్డు మీద నా కార్తీక్ అని ఉంది కదా. నా కార్తీక్ అవుతాడు కానీ.. నీ కార్తీక్ ఎలా అవుతాడు అని అనుకుందేమో.. అని అనుకొని లక్ష్మణ్.. మన దీపమ్మే కదా.. కోపం తెచ్చుకుంటే ఎలా. నువ్వు వెళ్లి బోర్డు పైన పెట్టు అంటుంది. ముక్కలన్నీ పైన జెండాలా కట్టేయ్. రెపరెపలాడుతుంది అంటుంది మోనిత. మీరేం టెన్షన్ పడకండి బాబాయి. మీరు బాగున్నారు అంతే చాలు. మీక్షేమమే నా క్షేమం. మీరు వెళ్లి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అంటుంది. మరోవైపు లక్ష్మణ్ ను బోర్డు పైన పెట్టు అంటుంది. దీంతో అన్నా దీపక్క వద్దన్నది కదన్నా అంటాడు ఓ వ్యక్తి. దీంతో అతడి చెంప చెల్లుమనిపిస్తుంది మోనిత.
మరోవైపు సౌందర్య ఇంట్లో వాళ్లు అందరూ హ్యాపీగా ఉంటారు. ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన మనసు అంతా ఇక్కడే ఉండి ఉంటుంది అంటుంది సౌందర్య. దీంతో మనమంతా సంతోషంగా అంత్యాక్షరి ఆడి తాతయ్యకు ఆ వీడియో పంపిద్దాం అంటుంది హిమ. శౌర్య కూడా ఓకే అంటుంది. కానీ.. వద్దు అంటారు.
మరోవైపు భారతి, రవి కారులో వెళ్తుంటారు. ఇప్పుడు అంతా హ్యాపీనే కదా అంటాడు రవి. అంతా ఓకే కానీ.. ఈ విషయంలో మోనిత కార్తీక్ కు ఎందుకు ఫేవర్ చేసిందో నాకు అర్థం కావడం లేదు అంటుంది. దీంతో లేదు రవి.. నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అంటుంది భారతి.
మరోవైపు కార్తీక్.. ఆనంద్ ను ఎత్తుకొని ఉంటాడు. ఇంతలో మోనిత వస్తుంది. దీపక్క అని పిలుస్తుంది. కార్తీక్ బాబును ఎత్తుకోవడాన్ని చూసి ఆదిత్య కొడుకును ఎత్తుకున్నావా.. మన కొడుకును ఏనాడైనా ఎత్తుకున్నావా అని ప్రశ్నిస్తుంది. దీంతో వీడు ఆదిత్య కొడుకు కాదు అని చెప్పబోతుండగా శ్రావ్య వద్దంటుంది. మోనితతో ఎందుకు గొడవ అని బాబును తీసుకెళ్తుంది.
మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో దీప వచ్చి.. ఎందుకు వచ్చిందో నేను చెబుతాను డాక్టర్ బాబు అంటుంది దీప. నువ్వు వస్తావన నాకు తెలుసు మోనిత.. అంటుంది దీప. వచ్చేలా చేశావు కదా దీపక్క అంటుంది మోనిత.
ఏం జరిగింది దీప అని అడుగుతాడు కార్తీక్. నా కార్తీక్ ఆశీస్సులతో వంటలక్క వైద్యశాల అంటూ తన పైత్యమంతా చూపిస్తూ బస్తీలో బోర్డు పెట్టింది. ఆ బోర్డును తీసేయించాను అంటుంది దీప. ఆ ఇల్లు నేను కొనుక్కున్నాను. నా ఇష్టం అంటుంది. అయితే నా పేరు ఎందుకు పెట్టుకున్నావు. డాక్టర్ బాబు పేరు ఎందుకు పెట్టుకున్నావు అని ప్రశ్నిస్తుంది దీప.
బస్తీ వాళ్లు అంతా ఇప్పుడు నా వాళ్లు. వాళ్లను నా వైపునకు తిప్పుకుంటాను అంటుంది మోనిత. నీ వైపునకు తిప్పుకోవడానికి వాళ్లు నీ ఫ్యాన్స్ కాదు మోనిత. వాళ్లు నా ఫ్యాన్స్ అంటుంది దీప. మాటలు బాగా నేర్చావు దీపక్క. కార్తీక్.. సింపుల్ గా అయ్యేదాన్ని నువ్వు కాంప్లికేట్ చేస్తున్నావు అంటుంది మోనిత.
ఇప్పటి దాకా నువ్వు ఏం చేసినా సహనంతో ఓపిక పట్టాం. నేను నీలా ఆలోచిస్తే నీకంటే పది రెట్లు ప్లాన్లు వేయగలను. సిద్ధంగా ఉండు మోనిత. ఈ దీప అంటే ఏంటో నీకు అతి త్వరలోనే చూపిస్తాను అంటుంది దీప. మరోవైపు బయటికి వెళ్దాం బాబాయి అని ఆదిత్యను అడుగుతారు పిల్లలు.
దీంతో నాకు కొంచెం పని ఉంది అంటాడు ఆదిత్య. అయితే సరే.. వారణాసిని పిలిచి ఐస్ క్రీం తినడానికి వెళ్లి అట్నుంచి అటే బస్తీకి వెళ్తాం అంటారు. దీంతో వద్దు అక్కడికి వద్దు. సాయంత్రం నేను మిమ్మల్ని తీసుకెళ్తాలే అని ఆదిత్య.. పిల్లలకు నచ్చజెబుతాడు.
మరోవైపు మోనిత.. తన బాబాయికి ఆపరేషన్ చేయాలని చెప్పడాన్ని దీపకు చెబుతాడు కార్తీక్. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటాడు. మనం మోనిత విషయంలో కాస్త సహనం పాటిస్తే మేలు అని దీపతో చెబుతాడు. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు.
డాక్టర్ బాబు మోనితకు దగ్గరవుతున్నాడేమో అని భయపడుతుంటుంది దీప. బాబాయి ఆపరేషన్ ను అడ్డం పెట్టుకొని మోనిత కొత్త నాటకం ఆడుతుందా. నిజంగా కార్తీక్ పై నిషేధాన్ని ఎత్తేసేందుకు మోనిత ప్రయత్నించిందా? అని దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.