Home » Entertainment » Bigg Boss Ott Telugu Contestant List
Entertainment

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీకి భారీగా స‌న్నాహాలు.. బ‌రిలోకి వివాదాల రాయుడు

Authored By
Sam C
The Telugu News | Published on: January 19, 2022, 12:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్‌ను.. మొదటిగా హిందీలో.. ఆ తర్వాత దక్షిణాది భాషలలో ప్రారంభించారు. ప్ర‌స్తుతం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇటీవ‌ల తెలుగులో సీజ‌న్ 5 పూర్తి కాగా, ఇందులో స‌న్నీ విజేత‌గా నిలిచాడు. సీజన్ ముగిసిన రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది ఈ షో. ఇందులో కంటెస్టెంట్స్ ఎవ‌రు, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై అనేక క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Advertisement

బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎంపికపై కరసరత్తులు పూర్తయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో బయటకొచ్చిన ఓ కంటిస్టెంట్ పేరు జనాల్లో హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ హోస్టుగా అక్కినేని నాగార్జునే ఉండబోతున్నారు. దీంతో పాటు ఇందులో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెబుతున్న నిర్వాహకులు ఓ కంటెస్టెంట్‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా బాగా ఫేమస్ అయిన కంటెస్టెంట్‌ వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన విష‌యం తెలిసిందే.

bigg boss ott Telugu contestant list

Advertisement

Bigg Boss OTT Telugu : లిస్ట్ రెడీనా..

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఉండే కొరియోగ్రాఫర్  ఆ కంటెస్టెంట్‌ .. గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు, సెలబ్రిటీలపై చేస్తున్న కామెంట్స్ హాట్ ఇష్యూగా మారుతున్నాయి. మరి ఇలాంటి ఆ కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపితే ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి