Home » Entertainment » Ram Gopal Varma Desire%e2%80%8cd Balakrishna Will Tirustada
Entertainment

BalaKrishna : రామ్ గోపాల్ వ‌ర్మ కోరిక‌ను బాలకృష్ణ తీరుస్తాడా.. ఇప్పుడు అంద‌రిలోను అదే చర్చ‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 19, 2022, 12:00 pm
Advertisement

RGV: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసిన అది సెన్సేష‌న‌ల్ అవుతుంది. ఆయ‌న ఇటీవ‌ల వైసీపీ ప్రభుత్వంపై త‌న ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. సినీ టిక్కెట్ల వ్య‌వ‌హారంలో వ‌ర్మ ప్ర‌భుత్వానికి ప‌ది ప్ర‌శ్న‌లు సంధించ‌డ‌మే కాకుండా అమ‌రావ‌తి వెళ్లి నానిని క‌లిసి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఇక తాజాగా ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య డైవ‌ర్స్ విష‌యంపై కూడా త‌న వాద‌న వినిపించాడు. అయితే వ‌ర్మ‌కి ఓ విచిత్ర‌మైన కోరిక ఏర్ప‌డింది. దానిని తీర్చ‌మ‌ని బాలయ్య‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడ‌ట‌.

Advertisement

బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ పోగ్రామ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రతి దాన్ని విమర్శనాత్మక కోణంలో చూసే వర్మ..బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ని మాత్రం అందనంత ఎత్తుకు ఎత్తేశారు. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ కితాబిచ్చారు కాంట్రవర్సీ డైరెక్టర్ వర్మ. అంతేకాదు తనకు కూడా ఆ షోలో పాల్గొనాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు వర్మ. బాలకృష్ణ గారు నాకో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కాకపోతే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశారు వర్మ.

Ram Gopal Varma Desire‌ds Balakrishna Tirustada

Advertisement

Balakrishna : వ‌ర్మ చిన్న కోరిక‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‎స్టాపబుల్ విత్ ఎన్బీకే షో అనేక రికార్డులు చెరిపేస్తూ దూసుకు పోతున్న విష‌యం తెలిసిందే. అటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ తన హోస్టింగ్‏తో సంచలనం సృష్టిస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ షోలో మెహాన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. వారిని తన స్టైల్లో పంచులతో.. డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య.మ‌హేష్ బాబు ఎపిసోడ్‌తో షో ముగియ‌నుంద‌నే టాక్ న‌డుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి