Bigg Boss OTT Telugu : పాత విష‌యాలు మ‌న‌సులో పెట్టుకొని ముమైత్ నాపై ప‌గ తీర్చుకుంటుంది.. శ్రీరాపాక ఆరోప‌ణ‌లు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 1 March 2022, 8:30 pm

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. 17 మంది స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. దీంతో విభేదాలు, గొడ‌వలు మొద‌లయ్యాయి. ముమైత్, శ్రీరాపాక బ్యూటీ శ్రీ రాపాక మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అందరూ శ్రీ రాపాకను టార్గెట్ చేశారు. అరియానా, అఖిల్, తేజస్వీ, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇలా అందరూ కూడా శ్రీ రాపాకను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. చాలా మంది శ్రీ రాపాకకే థమ్స్ డౌన్ సింబల్‌ను పెట్టారు. దీంతో శ్రీ రాపాక కన్నీటి పర్యంతమైంది. తనను ఒక అబద్దాలకోరుగా చిత్రీకరిస్తున్నారంటూ వాపోయింది.

ముమైత్ ఖాన్ కూడా పాత విషయాలను గుర్తు పెట్టుకుని ఇక్కడ నా మీద ఇలా చేస్తోందంటూ ఆరోపించింది. ఓ డ్యాన్స్ షోలో తనకు, ముమైత్ ఖాన్‌కు జరిగిన విషయాలను గుర్తు పెట్టుకుందని, అందుకే ఇలా చేస్తోందంటూ నగ్నం బ్యూటీ తెగ ఏడ్చేసింది. ప్రస్తుతం అయితే వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అనే పోటీ జరుగుతోంది. మొదటి వారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. దమ్ముంటే చేసి చూపించు అంటూ ఇరు టీంలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా మూడు టాస్కులు జరిగాయి. దాంట్లో వారియర్స్ టీం రెండు పాయింట్లతో గెలిచింది. రెండు సార్లు ఛాలెంజర్స్ టీంలోని మెంబర్స్ టాస్కులను పూర్తి చేయడంలో విఫలమయ్యారు.

bigg boss ott Telugu very interesting in recent episode

bigg boss ott Telugu very interesting in recent episode

Bigg Boss OTT Telugu : సింగిల్‌ని చేశారా..!

అఖిల్ .. శ్రీరాపాకతో వైబ్స్ లేవని చెప్పాడు. ఇద్దరి మధ్య బాండింగ్ కుదరడం లేదు లేదు అని అజయ్ ఏదో చెప్పాడని చెప్పాడు అఖిల్. అయితే తను ఆ మాట అనలేదని.. ఒకవేళ అంటే కనుక.. చూపించాలని కోరింది శ్రీరాపాక. ఇక ముమైత్ ఖాన్ కూడా అజయ్‌తో మంచి వైబ్స్ ఉన్నాయని అతనికి మంచి మార్కులే వేసేసింది. ఐ లైక్ యు చెప్పేసింది. అనంతరం శ్రీరాపాకతో వైబ్స్ ఏమీ లేవని.. వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ ఇలాగే ఉన్నాం అని చెప్పింది ముమైత్. అయితే శ్రీరాపాక నవ్వుడంతో.. ముమైత్ వెటకారంగా నవ్వుతూ హేళన చేసింది. మొత్తానికి హౌజ్‌లో ఇప్పుడిప్పుడే గ్రూపులు ఏర్ప‌డి వార్ న‌డుస్తుంది.

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి