Bigg Boss Sarayu gives clarity on her arrest
Bigg Boss Sarayu : బిగ్ బాస్ 5లో పాల్గొన్న భామ సరయు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె చుట్టూ ఎప్పుడు వివాదాలు నిలుస్తూ ఉంటాయి. సరయు అంటే బూతు.. బూతు అంటే సరయు.. అనేట్టుగా ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు వదులుతూ ఉంటుంది . ఈమె పోయి పోయి ఆ భజరంగ్ దళ్‌ని కెలికింది. తలకి గణపతి పప్పా మోరియా అనే బ్యాడ్జ్ కట్టుకుని భజరంగ్ దళ్ తరహాలో నలుగుర్ని వెంటపెట్టుకుని ‘7 ఆర్ట్స్’ వీడియోలో ఆమె చేసిన అరాచకం.. కటకటాల పాలయ్యేట్టు చేసింది.హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, దేవుళ్లను కించపరిచిందని విశ్వ హిందూ పరిషత్ సంస్థ పెట్టిన కేసులో సరయు అరెస్ట్ అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి.
తాజాగా వీటిపై స్పందించిన సరయు… మీ కంటెంట్ వెళ్లేందుకు లాక్కెళ్లారు, ఈడ్చుకెళ్లారు అని థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. కానీ అందులో రాసే మ్యాటర్ అయినా సరిగ్గా రాయండి. లాస్ట్ ఇయర్ 7ఆర్ట్స్ బిర్యానీ హౌస్‌ను సిరిసిల్లాలో ప్రారంభించారు. దాని కోసం గిప్పని ఇస్తా అనే షార్ట్ ఫిలిం తీశాం. సిరిసిల్లాలో రెస్టారెంట్ ప్రారంభమైంది. ఏడాది అవుతోంది. కానీ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ చేవూరి అశోక్ గారు మాత్రం మేం వీడియో తీయలేదని చెబుతున్నారు. కాంటాక్ట్ అయ్యామని చెబుతున్నారు. ఆయన మాతో కాంటాక్ట్ అయ్యాడనే దానికి ఆధారాలు చూపించండి అని పేర్కొంది.
Bigg Boss Sarayu gives clarity on her arrest
హిందువులవైనా మేం వేరే వాళ్ల మనో భావాలు ఎందుకు హర్ట్ చేస్తాం. మేం అది కూడా పెట్టా సినిమాలోని విజయ్ సేతుపతి నటించి సీన్‌ను రిఫరెన్స్ తీసుకుని చేశాం. దానికేం ఇబ్బంది లేదు కదా? మాకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదని అనుకున్నాం. కానీ వాళ్లకు ఇక్కడ ప్రాబ్లంగా ఉందని తెలిసి.. ఆ సీన్‌ను ట్రిమ్ చేసేశాం. భారతీయులం, హిందువలమైన మేము ఎన్నో మంచి సందేశాత్మక వీడియోలు కూడాచేశాం. జై జవాన్ అని ఆర్టికల్ 370ని సపోర్ట్ చేస్తూ వీడియో చేశాం. రైతుల కోసం ఓ మై గాడ్ అనే వీడియోను తీశాం. ఇన్నింటిని వదిలేసి మీరు దాన్ని మాత్రమే చూస్తే.. మాలోని రెండో కోణాన్ని ఎవరు చూస్తారంటూ సరయు చెప్పుకొచ్చింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.