Railway Jobs: సెంట్రల్ రైల్వేలో జాబ్ కొట్టడం మీ కలనా.. అయితే మీకో గుడ్ న్యూస్ వచ్చేసింది. రైల్వే డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు వచ్చి పడ్డాయి. ఇందుకోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఈ ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 756 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 263 ఖాళీలు విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వీటికి మార్చి 7 ఆఖరు తేదీగా ఉంది. ఆలోపే అప్లికేషన్ చేసుకోవాలి. కాగా ఒకరు ఒక్క యూనిట్‌కు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి.
అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ యూనిట్లకు అప్లికేషన్ చేసుకుంటే అది చెల్లదు. అంతే కాకుండా విద్యార్హతలను కూడా ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకునేఇ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 756 జాబుల్లో క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ తో పాటు మంచేశ్వర్, భువనేశ్వర్ డివిజన్లలో 190 పోస్టులు ఉన్నాయి. ఖుర్దా రోడ్ డివిజన్ లో 237, వాల్తేర్ డివిజన్ లో 263 పోస్టులు ఉన్నాయి. ఇక సంబాల్‌పూర్ డివిజన్ లో కూడా 66 జాబులు ఉన్నాయి. వాల్తేర్ డివిజన్‌లో 263 జాబులు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్ సెక్షన్ లో 102, వెల్డర్ లో 54, టర్నర్ లో 11, ఎలక్ట్రీషియన్ లో 50, మెషినిస్ట్ లో 4, డ్రాఫ్ట్స్‌మ్యాన్ లో 4 జాబులు ఉన్నాయని తెలుస్తోంది.
వీటితో పాటు వైర్‌మ్యాన్ పోస్టులు 10, కార్పెంటర్ పోస్టులు 9, మేసన్ 6 జాబులు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ నెల 8ననే దరఖాస్తు ప్రారంభం అయింది. 10వ తరగతి 50 శాతం పాస్ పర్సెంటీజీ ఉన్న వారంతా అర్హులు. దాంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లో చదువకుని పాసై ఉండాలి. 24 ఏళ్లులోపు వయసు ఉండాలి. రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాగా ఈ జాబుల కోసం https://etrpindia.com/rrc_bbn_act/index.php వెబ్‌సైట్ లో అప్లై చేసుకోవాలి. కాగా అప్లై చేసుకున్న ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కచ్చితంగా జత చేయాల్సి ఉంటుంది. మరి లేటెందుకు మీరు కూడా అప్లై చేసుకోండి.
Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అమ్మడు ఫోటో…
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
This website uses cookies.