Bigg Boss Telugu 5 Day 1 : వాడీవేడీగా తొలి వారం నామినేషన్స్.. టాస్క్ చేయి.. అంటూ నాకు చెప్పొద్దు అని సన్నీకి షణ్ముఖ్ వార్నింగ్.. జెస్సీని ఏడిపించిన కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 5 Day 1 : మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభం అయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ ప్రారంభం కాగా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేసి ఇంట్లోకి పంపించారు. ప్రీమియర్ పూర్తయ్యాక.. ఇక నాగార్జున బిగ్ బాస్ హౌస్ కు తాళం వేసేశారు. ఇక.. ఈ రోజు నుంచి వంద రోజుల వరకు ఈ హౌస్ లో ఎన్ని విచిత్రాలు జరుగుతాయో.. ఏంటో వేచి చూద్దాం అని చెప్పి నాగార్జున బైబై చెప్పేసి వెళ్లిపోయారు.

Bigg boss season 5 telugu day 1 in the house highlights
మొదటి రోజు ఉదయం లేవగానే సిరి హన్మంతు, జెస్సీ.. ఇద్దరూ టైమ్ పాస్ కావడం లేదని.. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ల వస్తువులు దొంగలించి అక్కడా ఇక్కడా దాచి.. తర్వాత ఎవరివి వారికి ఇచ్చేశారు. హమీదాకి సంబంధించిన కొన్ని వస్తువులు దాచారు. దీంతో ఎవరైనా సీక్రెట్ టాస్క్ చేస్తున్నారా? అని హౌస్ మెట్స్ అనుకున్నారు. షణ్ముఖ్ వస్తువులను కూడా వాళ్లు దాచారు.

Bigg boss season 5 telugu day 1 in the house highlights
కట్ చేస్తే.. జెస్సీ, హమీదా, శ్వేతా రెడ్డి.. ముగ్గురూ కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చొని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు. తమ ఇంట్లో ఉండే పెట్స్ గురించి మాట్లాడుతుంటారు. జెస్సీ ఏదో సరదాకు.. హమీదా కుక్క పిల్లలను ఏదో అన్నాడని హమీదా ఫీల్ అవుతుంది.
Bigg Boss Telugu 5 Day 1 : మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది?
మొదటి రోజు నామినేషన్లు కాస్త వాడీవేడీగానే జరిగాయి. అందరూ హౌస్ లోకి వచ్చి ఒక్క రోజే అయినా సరే… అప్పటికే తోటి కంటెస్టెంట్లలో కొన్ని రీజన్స్ వెతుక్కున్నారు. వాటిని బాగానే ప్రజెంట్ చేయగలిగారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకొని.. వాటిలో వాళ్లకు నచ్చన పాయింట్లను ఎలివేట్ చేస్తూ ఎలిమినేట్ ప్రక్రియలో పాల్గొన్నారు.
నాకు టాస్క్ చేయి.. అంటూ ఎవరైనా చెబితే నాకు అస్సలు నచ్చదు.. అంటూ షణ్ముఖ్.. సన్నీని నామినేట్ చేయడం, హమీదాతో పాటు.. చాలామంది జెస్సీని నామినేట్ చేయడం.. విశ్వ కూడా జెస్సీని నామినేట్ చేయడంతో.. జెస్సీ కొంచెం భావోద్వేగానికి గురయ్యాడు. హమీదా కూడా నామినేషన్ల సమయంలో ఏడ్చేసింది.

Bigg boss season 5 telugu day 1 in the house highlights
లహరి, హమీదాకు కూడా పడలేదు. నామినేషన్ల సమయంలో ఇద్దరూ కాసేపు పోట్లాడుకున్నారు. నీకు పొగరు.. అంటే నీకు పొగరు.. అంటూ ఒకరిని మరొకరు అనేసుకున్నారు. ఇలా.. మొత్తం మీద మొదటి రోజు నామినేషన్స్ ముగియగా.. తొలి వారం ఇంటికి వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు.. రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జెస్సీ.