Bigg Boss BuZZ | శివాజీనే రోస్ట్ చేసిన శ్ర‌ష్టి… ఇలా ఊరించి ఉసూరుమ‌నిపించాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss BuZZ | శివాజీనే రోస్ట్ చేసిన శ్ర‌ష్టి… ఇలా ఊరించి ఉసూరుమ‌నిపించాడు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 September 2025,2:00 pm

Bigg Boss BuZZ | బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రష్ఠివర్మని తొలివారంలోనే ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా షాకింగ్‌గానే అనిపించింది.అయితే ఎలిమినేషన్ తరువాత జరిగే బిగ్ బాస్ బజ్ ని శివాజీ హోస్ట్ చేస్తుండటంతో మంచి హైప్ వచ్చింది. అయితే ప్రోమో విడుద‌ల కాగా, శివాజీ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. గతంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేసిన అర్జున్, గీతూ రాయల్, అరియానా, రాహుల్ సిప్లిగంజ్ వాళ్లే బెటర్ అన్నట్టుగా చప్పగా సాగింది.

#image_title

తుస్సుమ‌నిపించాడుగా..

గత సీజన్‌లో అంబటి అర్జున్ జనంలో ఏవైతే సందేహాలు ఉండేవే.. వాటిని సూటిగా సుత్తిలేకుండా కొట్టినట్టుగా అడిగేవాడు. అయితే శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేసరికి అంతకు మించే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ.. శ్రష్ఠి వర్మ బజ్ ఇంటర్వ్యూ చూస్తూ.. అబ్బే పసలేదు అనేట్టుగానే ఉంది. రోస్టింగ్ కాదు కదా.. ప్రశ్నలు కూడా సప్పగా సాగినట్టే ఉన్నాయి. రివర్స్‌లో శ్రష్టి.. శివాజీనే రోస్ట్ చేసినట్టుగా ఉంది.

శివాజీ హోస్ట్ చేస్తాడ‌నడంతో బజ్ ఇంటర్వ్యూపై అంచనాలు పెరిగాయి. అయితే ఆయన హోస్టింగ్‌తో మాత్రం తుస్సుమనిపించారు. శివాజీ ఉన్న బిజీ షెడ్యూల్‌లో బజ్ ఇంటర్వ్యూకోసం అంత టైమ్ కేటాయించడం కష్టం కాబట్టి.. బిగ్ బాస్ టీం ఏదైనా ప్రశ్నలు వేయమంటుందో అవి వేసి వెళ్లిపోవడం తప్పితే చేయగలిగింది ఏం లేదు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎలాగైతే టాక్‌ బ్యాక్‌లో బిగ్ బాస్ టీం ఆడించనట్టుగా ఆడి ఎలా వెళ్లిపోతారో.. బజ్ ఇంటర్వ్యూలోనూ శివాజీ అదే పాత్రను పోషించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

 

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది