Bigg Boss Season 7 Telugu : బిగ్ బాస్ లో ప్రియాంకతో అమర్ దీప్ తీరు నచ్చలేదని సీరియస్ అయిన ప్రియుడు శివకుమార్ ..!
Bigg Boss Season 7 Telugu : ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా గా కొనసాగుతుంది. ఉల్టా ఫుల్టా సీజన్ అంటూ వచ్చిన బిగ్బాస్ సీజన్ 7 ఈసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఫైనలిస్టులుగా అమర్ దీప్, ప్రియాంకలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. వీళ్ళతో శోభ శెట్టి కూడా బాగా కలిసిపోయింది. ముగ్గురు ఒకే ఆట ఒకే మాటగా హౌస్ లో ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ శోభా కంటే ప్రియాంకకు అమర్దీప్ ఎక్కువ విలువ ఇస్తాడు. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇక అమర్ ప్రియాంక జానకి కలగనలేదు సీరియల్ లో నటించారు. అప్పటి నుంచి వీరికి గట్టి పరిచయం ఉంది. ఆ బంధాన్ని హౌస్ లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. తాజాగా ప్రియాంక ప్రియుడు శివకుమార్ వారి బంధం పై క్లారిటీ ఇచ్చారు.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శివకుమార్. ప్రియాంక చాలా కాలంగా శివ కుమార్ తో కలిసి ఉంటుంది. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి వచ్చిన శివకుమార్ ఆమెను మిస్ అవుతున్నాను అని తెగ ప్రేమ కురిపించాడు. ప్రియాంక కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ ఓపెన్ గా అడిగేసింది. కానీ ప్రస్తుతం ప్రియాంక జైన్ ప్రియుడు అమర్ ప్రియాంక బంధం గురించి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకుమార్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అమర్దీప్ ప్రియాంకతో ఉంటున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్ ప్రియాంకలు కలిసి పనిచేయడం వల్ల వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారని చెప్పారు.
కానీ బాల్ టాస్క్ లో మాత్రం ఒక అమ్మాయని చూడకుండా ప్రియాంక ను లేపి క్రింద పడేయడం నాకు అస్సలు నచ్చలేదని, ఈ ఎపిసోడ్ వచ్చిన రోజు చాలా బాధపడ్డాను అని శివకుమార్ ఎమోషనల్ అయ్యారు. ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారని చెప్పారు. ప్రియాంక గెలిచే అవకాశం లేదు కానీ గెలిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనలిస్టులో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రియాంకలు ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారో తెలియాల్సి ఉంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.