Bigg Boss Siri : సిరి బాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్‌కి… ఇక ర‌చ్చ మాములుగా ఉండ‌దు మ‌రి..!

Authored By Sam C | The Telugu News | Published on: June 5, 2022, 3:30 pm

Bigg Boss Siri : ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో ముగిసింది. ప్ర‌స్తుతం సీజ‌న్ 6కి సంబంధించిన స‌న్నాహాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన లోగో ప్రోమో విడుదల కావడంతో కొత్త సీజన్ సందడి షురూ అయ్యింది. కొత్త కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి.. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ గా రాబోతున్నాడంటూ ప్రచారం నడుస్తుండగా.. ఒక్కసారిగా అతను ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. ఒకవేళ అతను కనుక బిగ్ బాస్‌లోకి వస్తే.. వార్ వన్ సైడ్ అంటూ అతని ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు.

అయితే వీరిలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు శ్రీహాన్. నిజానికి బిగ్‌బాస్‌ ఓటీటీ మొదటి సీజన్‌లోనే శ్రీహాన్‌ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్‌ బుల్లితెర ఐదో సీజన్‌లో సిరి, షణ్ముఖ్‌ ట్రాక్‌ వారిపై నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఈ నెగెటివిటీ శ్రీహాన్‌కు కలిసొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్‌ మాట్లాడిన మాటలు, పాడిన పాట అందరిని ఆకట్టుకున్నాయి. సిరి, షణ్ముఖ్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో బాధపడిన శ్రీహాన్‌ తన మాటలు, పాట రూపంలో చూపించి బీభత్సమైన పాజిటివిటీని సంపాదించుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు బిగ్‌బాస్‌ ఓటీటీ అవకాశం వచ్చిన దాన్ని తిరస్కరించాడని సమాచారం.

Bigg Boss Siri boy friend enter into bigg boss

Bigg Boss Siri boy friend enter into bigg boss

Bigg Boss Siri : శ్రీహాన్ ఎంట్రీ ప‌క్కానా..

అయితే తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో శ్రీహాన్‌ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో శ్రీహాన్‌ పాల్గొంటే కచ్చితంగా టైటిల్‌ రేస్‌లో ముందుంటాడని చాలా మంది భావిస్తున్నారట. సిరి ప్రియుడుగా.. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వెళ్లిన శ్రీహాన్.. ‘నన్ను వదిలేస్తున్నావా’? అంటూ అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు. స్టేజ్‌పై తన మాటలతోనే కాదు.. పాటతోనే అందరి గుండెల్ని పిండేశాడు. ‘‘ప్రతిసారి ఇలా అలిగింది నీ మనసే.. ఓసారిలా.. రమ్మన్నదే మనసే.. చేజారి పోనీయకన్నదీ.. నీ వరసే.. నయనాలు నోరు తెరిచాయి ఇలా..’’ అనే పాటతో తన మనోవేదన వినిపించాడు. శ్రీహాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్తే మాత్రం టైటిల్ రేస్‌లో ముందు ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp