Home » Entertainment » Bigg Boss Swetha Varma About Her Marriage Rumors
Entertainment

Bigg Boss Swetha Varma : బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి వార్తలు.. అదిరిపోయేలా అసలు విషయం చెప్పిన శ్వేతా వర్మ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 12, 2022, 10:00 am
Advertisement

Bigg Boss Swetha Varma : బిగ్ బాస్ షోతో శ్వేతా వర్మ అందరికీ పరిచయమైంది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో శ్వేతా వర్మ నటించింది. కానీ సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో శ్వేతా వర్మ చేసిన సందడి మామూలుగా లేదు. ఆనీ మాస్టర్‌తో కలిసి శ్వేతా వర్మ చేసిన అల్లరి, పెట్టుకున్న గొడవలు, ఫైటింగ్, యాక్షన్ ఇలా అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇక శ్వేతా వర్మకు ఓ మోస్తరు క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఇప్పుడు శ్వేతా వర్మ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ఈ మధ్యే శ్వేతా వర్మ నటించిన ఓ చిత్రం కూడా రిలీజ్ అయింది. కానీ అది వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియకుండానే పోయింది.

Advertisement

ఇక అంతకు ముందు కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రంలోనూ శ్వేతా వర్మ కనిపించింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలింది. అలా శ్వేతా వర్మకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సరైన సక్సెస్ దొరకడం లేదు. ఈ మధ్య శ్వేతా వర్మ మీద కొన్ని రూమర్లు వచ్చాయి. శ్వేతా వర్మ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై శ్వేతా వర్మ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అదిరిపోయేలా ఓ పోస్ట్ వేసింది. ఆ పోస్ట్‌లో ఏముందంటే.. ‘ఇంకా నాకు కావాల్సిన నా మనిషి దొరకలేదు..

Bigg Boss Swetha Varma about her marriage rumors

Advertisement

నాకు సరైన వాడు దొరకలేదు.. మామూలుగా అయితే అన్ని విధాలుగా సరైనవాళ్లు దొరకరు.. కానీ మన ఎనర్జీ, మన ఆలోచనలు, మన మోరల్స్,ఐడియల్స్‌ సరిసమానంగా ఉంటూ.. మిగతా ప్రపంచాన్ని మరిచిపోయేలా చేసే వ్యక్తి దొరకాలి. కానీ ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉంది. నా కెరీర్ మీదే దృష్టి పెట్టేశాను.. సరైన టైంలోనే నా పెళ్లి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నాకు సరైన వాడిని వెతుకుతాను.. అంటూ ఇలా శ్వేతా వర్మ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ బ్యూటీ మాత్రం పెళ్లి మీద పిచ్చ క్లారిటీతో ఉందనిపిస్తోంది. శ్వేతా వర్మ ఎక్కువగా ఆనీ మాస్టర్‌తోనే కలిసి కనిపిస్తుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి