Bigg Boss Telugu 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఈసారి కూడా ప్రేక్షకులను తనదైన స్టైల్ లో అలరిస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఈసారి అంత ఉల్టా పుల్టా అంటూ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఏడవ సీజన్ నడుస్తుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏడో సీజన్ లోకి 20 మందికి పైగా కంటెస్టెంట్ లు ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 14 మందిని హౌస్ లోకి పంపించి ఆట మొదలుపెట్టారు బిగ్ బాస్. ఇది ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అని ముందు నుంచి చెబుతూ వస్తున్న నాగార్జున ఈ షో ప్రసారంలో ఎన్నో ఊహించని సంఘటనలు చూపిస్తున్నారు. షో మధ్యలో ఇంకొందరు కంటెస్టెంట్స్ యాడ్ అవ్వడం చూస్తున్నాం.
అలాగే మరోవైపు హౌస్లో హీట్ పెంచే గొడవలు జరుగుతున్నాయి. గత ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్, బోలే షావలికి ఊహించని కౌంటర్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. ప్రస్తుతం ఎనిమిదో వారం నామినేషన్స్ జరుగుతుండగా సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఫోటోలను మంటల్లో కాల్చి అందుకు తగిన సమాధానం చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్ కృష్ణ ఎవరు ఊహించని పాయింట్స్ తీస్తూ జనాలలో హీట్ పెంచేశాడు. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఆలోచింపజేశాయి. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తున్నప్పుడు సందీప్ మాస్టర్ విషయంలో నువ్వు మాట మార్చడం, అది అడిగిన నాగార్జున సార్ ముందు డిఫెండ్ చేసుకోలేకపోవడం నచ్చలేదు అని చెప్పాడు గౌతమ్. దీంతో పల్లవి ప్రశాంత్ బదులు ఇవ్వలేకపోవడం చూశాం.
ఆ తర్వాత గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్ మధ్య కాసేపు వాదన జరిగింది. అయితే కూల్ గా ఉంటూనే పల్లవి ప్రశాంత్ ను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు గౌతం కృష్ణ. ఆ తర్వాత భోలే షావలిని నామినేట్ చేస్తూ తనదైన స్టైల్ లో రీజన్స్ చెప్పాడు. బోలే షావలిని టాస్క్ లో ఫిజికల్ గా వీక్ గా ఉన్నారని కూల్ గా చెప్పాడు గౌతమ్. కానీ బోలే మాత్రం గౌతమ్ ను వెక్కిరిస్తున్నట్లు పాటలు పాడుతూ రచ్చ చేశాడు. నువ్వు డాక్టర్ అయితే చేపట్టుకొని బీపీలు చూడు నేను వీకో కాదో చెప్పకు అని అన్నాడు. అయితే ఈ మొత్తం సీన్లో గౌతం కృష్ణ కూల్ గా ఉండడం నామినేషన్ లో ఆయన తీసిన పాయింట్స్ జనాలకు కనెక్ట్ అయ్యాయి అని చెప్పాలి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.