
Bigg Boss Telugu 8 : తేజ కన్నీళ్లకి కరిగిన బిగ్ బాస్.. అమ్మ రాకతో పట్టలేని ఆనందం
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తుంది. ఈ వీక్ మొత్తాన్ని ఫ్యామిలీ వీక్‌గా మార్చారు. ఒక్కో కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు హౌజ్‌లోకి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక తాజా ఎపిసోడ్‌లో ప్రేరణ భర్త శ్రీపాథ్‌కి కుదరకపోవడంతో ఆయన ముందుగా రాలేకపోయాడు. దీంతో శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రేరణని సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు బిగ్ బాస్ కూడా వారి ప్రేమ కోసం లవ్ బెలూన్స్ తో గార్డెన్ ఏరియాని ప్రత్యేకంగా డెకొరేట్ చేయించడం విశేషం. భర్త రావడంతో ప్రేరణ కూడా ఫుల్ హ్యాపీ. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. బాగా ఆడుతున్నావని, కానీ చెప్పే విషయాలను టోన్ తగ్గించుకుని చెప్పాలని ప్రేరణకి సలహా ఇచ్చాడు శ్రీపాథ్.
అలాగే ప్రేరణ ఎలా ఆడుతుందని రోహిణి అడగ్గా, బాగా ఆడుతుందని, ఏడాది పాటుగా నన్ను ఆడుకుందిగా అంటూ కామెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది.ఇక చివరగా వీరిద్దరికి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరి మధ్య బెలూన్స్ ఉంచి పగలకొట్టే టాస్క్ ఇవ్వడం ఇది ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఇది చూసి జెలసీ ఫీలైన అవినాష్ తన భార్యని మళ్లీ పంపించమని బిగ్ బాస్‌ని కోరడం హైలైట్‌గా నిలిచింది. అనంతరం టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరు పేరెంట్స్ వచ్చారు. తనకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. మా అమ్మని కూడా పంపించండి బిగ్ బాస్ అంటూ వేడుకున్నాడు. ఆ సమయంలో అమ్మ నుండి ఫోన్ వచ్చింది. రాలేకపోతున్నాను అని అమ్మ అనడంతో తేజ చాలా బాధపడ్డాడు.
Bigg Boss Telugu 8 : తేజ కన్నీళ్లకి కరిగిన బిగ్ బాస్.. అమ్మ రాకతో పట్టలేని ఆనందం
అయితే కొంత సేపటి తర్వాత తేజ వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తేజ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. సంతోషంలో ఉప్పొంగిపోయాడు. ఇంతకంటే ఇంకేం అవసరం లేదంటూ కామెంట్ చేశారు. తాను బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం పెద్ద అఛీవ్‌మెంట్ అని, ఇందులోకి మా అమ్మని తీసుకురావాలనేది తన డ్రీమ్ అని, ఇప్పుడు అది సాధించానని, ఇక తాను సక్సెస్ అయ్యానని, ఇదే తన విజయం అంటూ ప్రకటించాడు తేజ.గతంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తేజ తన అమ్మని తెచ్చుకోలేకపోయాడు.ఇప్పుడు ఇది సాధ్యమైంది. నీ కోరిక నేను హౌజ్‌లోకి రావడం. అది తీరింది. నా కోరిక నిన్ను టాప్ 5లో చూడటం. ఆ కోరిక నెరవేర్చమని తెలిపింది తేజ అమ్మ. వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా సాగాయి. అంతిమంగా ఫ్యామిలీ వీక్ విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తంగా పదుకొండు వారాల గేమ్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్‌కి నాగార్జున రాబోతున్నారు. ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తాడా అనేది చూడాలి. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం విష్ణు ప్రియా, తేజ, అవినాష్, పృథ్వీరాజ్, యష్మి, గౌతమ్ రెడీగా ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. Bigg Boss Telugu 8 prerana reality revealed by husband sripadh
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.