Nayanthara : ధనుష్ నీ అసలు రంగు ఇది.. నయనతార ఓపెన్ లెటర్ కోలీవుడ్ అంతా షేక్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద అక్కడ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ధనుష్ స్టేజ్ మీద మంచి మాటలు ఉత్సాహకరమైన మాటలు ఫ్యాన్స్ తో చెబుతాడు కానీ అతను అలాంటి వాడు కాదంటూ ఆమె ఫైర్ అయ్యింది. స్వశక్తితో ఎదిగిన తనకు ఇలాంటి అడ్డంకులు ఎన్నో దాటుకుని వచ్చానని నయనతార రాసుకొచ్చారు. ఇంతకీ అసలు వివాదానికి కారణం ఏంటంటే.. నయనతార బయోపిక్ గా ఒక డాక్యుమెంటరీ వస్తుంది. ఇందులో నయనతార విఘ్నేష్ శివన్ మ్యారేజ్ కి సంబందించిన వీడియోస్ కూడా పెట్టనున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈమధ్యనే దీనికి సంబందించిన టీజర్ రిలీజైంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ గా వస్తున్న ఈ డాక్యుమెంటరీ పై ధనుష్ ప్రొడక్షన్ నుంచి 10 కోట్ల నష్ట పరిహారం వేశారు. అది కూడా ఆ డాక్యుమెంటరీలో తమ ప్రమేయం లేకుండా తమ సినిమాకు సంబందించిన క్లిప్స్ వాడుకున్నందుకు ఈ నష్ట పరిహారం దావా వేశారు.
ఐతే ఈ వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగానే సాల్వ్ చేద్దామని అనుకున్నా కుదరలేదు. అందుకే ఓపెన్ లెటర్ తో దాన్ని బట్ట బయలు చేస్తూ నయనతార ధనుష్ ని ఎటాక్ చేసింది. ధనుష్ నిర్మాణంలో నయనతార లీడ్ రోల్ లో విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నాన్ రౌడీ థాన్ కి సంబందించిన క్లిప్స్ వాడుకుంటామని ధనుష్ ని అడిగితే అతను ససేమీరా నో అన్నారట. ఐతే టీజర్ లో 3 సెకన్ల క్లిప్ వచ్చే సరికి ధనుష్ ఆ డాక్యుమెంటరీ మీద కేసు వేశాడు.
Nayanthara : ధనుష్ నీ అసలు రంగు ఇది.. నయనతార ఓపెన్ లెటర్ కోలీవుడ్ అంతా షేక్..!
నయనతార కూడా తిరిగి ఈ ఇష్యూని కోర్ట్ లోనే తేల్చుకుందామని హెచ్చరించారు. ఐతే ఈ ఇష్యూపై నయనతార ఓపెన్ లెటర్ రాయడం ధనుష్ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ కలిగించిందని చెప్పొచ్చు. వాళ్లు అడిగిన దాన్ని కాదు కూడదు అని కాకుండా మరో విధంగా ఏదైనా హెల్ప్ చేసుంటే బాగుండేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ధనుష్ పై నయనతార ఎటాక్ కోలీవుడ్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. Nayanthara , Dhanush, Kollywood, Vighnesh Siva, Nan Rowdy Thaan
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.