Ariyana : మీద కూర్చొని ముద్దు పెట్టాల‌న్న యాంకర్ శివ‌.. దూల తీర్చిన అరియానా

 Authored By sandeep | The Telugu News | Updated on :6 March 2022,10:00 pm

Ariyana : అందాల ముద్దుగుమ్మ అరియానా బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన ఈ భామకు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్ త‌లుపు త‌ట్టింది. చాలా స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా ఉంటూ గేమ్ ఆడుతూ వ‌చ్చిన అరియానా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్‌ రన్నరప్‌గా వెనుదిరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో సంద‌డి చేస్తుంది. ఇందులో ఆమె చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ యాంక‌ర్ శివ‌తో ముచ్చ‌టించింది.పనిష్మెంట్ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటుండ‌గా, ఒక‌వేళ నాకు ఏం పరిష్మెంట్ ఇస్తావని అరియానా అంటే.. నువ్ నాపైన కూర్చుని ఇక్కడ ముద్దుపెట్టాలని అన్నాడు. ఆ మాటతో అరియానా తల పగలకొడతా అని పంచ్ ఇచ్చింది. పనిష్మెంట్ ఇస్తే చేయాలి.. కావాలంటే నేను కూడా నీకు ముద్దులు పెడతాడు అని యాంకర్ శివ అనడంతో.. ఒళ్లు బాగా తిమ్మిరిగా ఉంది కదా నీకు.. ముద్దులేనా ఇంకేమైనా అనిపిస్తుందా? అని అడిగింది. అంతేకాదు అత‌నికి మైండ్ బ్లాక్ అయ్యేలా పంచ్ కూడా ఇచ్చింది.నేను తమ్ముళ్లకి ముద్దు పెట్టను.

Bigg Boss Telugu OTT ariyana strong counter to anchor shiva

Bigg Boss Telugu OTT ariyana strong counter to anchor shiva

Ariyana : ర‌చ్చ భీబ‌త్సంగా ఉందిగా..!

. బ్రో!! అనేసింది ఆ మాటతో పులిహోర రాజాకి పులుసుకారిపోయినంత పని అయ్యింది. అతి తెలివితేటలు ప్రదర్శించే యాంక‌ర్ శివ పప్పులు అరియానా దగ్గర ఉడకలేదు.. బోల్డ్‌గా ముద్దు అడిగితే.. అంతే ఆన్సర్ ఇచ్చి శివ నోరు మూయించింది అరియానా. అయితే మార్చి 3 నాటి ఎపిసోడ్‌లో అషూ, అరియానా ఇద్దరూ చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో హర్టయిన అరియానా చెప్పుతో కొట్టడం నచ్చలేదని మాట్లాడింది. నువ్వు అలా చేశావ్‌ కాబట్టే తాను తిరిగి కొట్టానని చెప్పింది. దీంతో అషూ ఆమెకు సారీ చెప్పింది. .

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి