Ariyana Glory : సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన అరియానా అర్ధ‌రాత్రి దొంగ‌త‌నం.. ఇలా మారిందేంటి..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ariyana Glory : సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన అరియానా అర్ధ‌రాత్రి దొంగ‌త‌నం.. ఇలా మారిందేంటి..?

Ariyana Glory  : రామ్ గోపాల్ వ‌ర్మ బ్యూటీగా పేరొందిన అందాల భామ అరియానా. వ‌ర్మ‌తో బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఇటీవ‌ల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ సొగసరి. నెట్టింట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ.. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను, అలానే త‌న గ్లామ‌ర్ ఫొటోలని తెగ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. అరియానాకి బిగ్ బాస్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ షో […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2024,1:00 pm

Ariyana Glory  : రామ్ గోపాల్ వ‌ర్మ బ్యూటీగా పేరొందిన అందాల భామ అరియానా. వ‌ర్మ‌తో బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఇటీవ‌ల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ సొగసరి. నెట్టింట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ.. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను, అలానే త‌న గ్లామ‌ర్ ఫొటోలని తెగ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. అరియానాకి బిగ్ బాస్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ షో త‌ర్వాత అరియానా పేరు తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఎప్పుడు ఏం చేసిన కూడా అరియానా హైలైట్ అవుతుంది. తాజాగా ఈ అమ్మ‌డు చేసిన దొంగ‌త‌నం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కొంద‌రైతే అరియానాని తిట్ట‌రాని తిట్లు తిడుతున్నారు.

Ariyana Glory  : ఇదేమి పాడుప‌ని..

బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు ఓ ఫంక్ష‌న్‌కి కారులో వెళుతుంది. అయితే న‌గ‌ర‌ శివారులో పాల కూర తోట కనిపించ‌డంతో ఆమె ఆగ‌లేక రాత్రి స‌మ‌యంలో ఎవ‌రు చూడ‌కుండా పాల కూర దొంగతనం చేసింది. ప‌ది రూపాయ‌లు పెడితే బ‌య‌ట దొరుకుతాయి క‌దా. ఇవి ఎందుకు అలా దొంగ‌త‌నం చేస్తున్నావు అంటే, ఇవి ఫ్రెష్‌వి క‌దా అంటూ ఏవో క‌వర్ చేసింది. అయితే అరియానా వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుండ‌గా, దానిపై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పాపం రైతు క‌ష్ట‌ప‌డి పండించుకుంటే ఇలా దొంగ‌త‌నం చేయ‌డానికి సిగ్గులేదా అంటూ కొంద‌రు మండిప‌డుతున్నారు. ఇక అరియానా తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. కొంచెం ఒళ్ళు చేసిన అరియనా మరింత హాట్ గా తయారైంది. అయితే కొందరు ఆమెను లావు అయ్యావని విమరిస్తుండ‌గా, వారికి త‌న‌దైన శైలిలో అరియనా కౌంటర్ ఇచ్చింది.

Ariyana Glory సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన అరియానా అర్ధ‌రాత్రి దొంగ‌త‌నం ఇలా మారిందేంటి

Ariyana Glory : సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన అరియానా అర్ధ‌రాత్రి దొంగ‌త‌నం.. ఇలా మారిందేంటి..?

ఇక అరియానా బిగ్ బాస్ లో పాల్గొన్న‌ప్పుడు ఆమె త‌న ముక్కుసూటిత‌నంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్స్ లో అరియనా ఒకరిగా నిలిచింది. ఆ సీజ‌న్‌లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనాకు 4వ స్థానం దక్కింది. బిగ్ బాస్ అనంతరం ఆమెకు బుల్లితెర మీద వ‌రుస ఆఫ‌ర్స్ వెల్లువెత్తాయి. బీబీ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో డాన్స్ రియాలిటీ షో జ‌ర‌గ‌గా అందులోను స‌త్తా చాటింది. అవినాష్ తో జతకట్టిన అరియనా ఫైనల్ కి వెళ్లింది కాని ట్రోఫీ ద‌క్కించుకోలేక‌పోయింది. బీబీ జోడి ఫైనల్ లో ఫైమా-ఆర్జే సూర్య జోడీ చేతిలో ఓడిపోగా వారు రూ25 ల‌క్ష‌లు ద‌క్కించుకునే ఛాన్స్ కోల్పోయారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది