bigg boss ott final list
Bigg Boss Telugu OTT : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షో ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ బిగ్ బాస్ ఓటీటీ లో ప్రధానంగా మాజీ కంటెస్టెంట్స్ ఉండబోతున్నట్లుగా ఇప్పటికే నిర్వాహకులు హింట్ ఇచ్చారు. మెజారిటీ శాతం మాజీ కంటెస్టెంట్ లు ఉండడం ద్వారా కచ్చితంగా వివాదాలు పీక్స్ లో ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత సీజన్లో వివాదాస్పద వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.ఉదాహరణకు ముమైత్ ఖాన్ అంతకు ముందు సీజన్లో ఎంతటి వివాదాస్పద కంటెస్టెంట్ గా మారిందో తెలిసిందే.
ప్రతి ఒక్కరి తో గొడవలు పెట్టుకుంటూ ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అందుకే ఆమెను ఎంపిక చేశారు. సాధారణంగా బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ అంటూ అంతా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ బిగ్ బాస్ స్క్రిప్ట్ కాకపోవచ్చు కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మాత్రం పూర్తిగా స్క్రిప్ట్ అయ్యి ఉంటుంది అంటూ స్వయంగా నిర్వాహకులే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. టీవీలో టెలికాస్ట్ అయ్యేది కాదు కనుక ఎలా ఉన్నా నడిచి పోతుంది. కేవలం డిజిటల్ ద్వారంపై స్ట్రీమింగ్ అయ్యేది కనుక ఇష్టానుసారంగా వివాదాలు గొడవలు రొమాన్స్ ఇలా ప్రతి ఒక్కటి అత్యధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కూడా బూతులు ఎక్కువగానే ఉంటాయి. కనుక ఈ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ లో కచ్చితంగా అడల్ట్ కంటెంట్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు అనిపిస్తోంది. ఓటీటీ కంటెంట్ అంటే ఎక్కువ శాతం మంది యువత మాత్రమే చూస్తారు.
Bigg Boss Telugu OTT fully scripted says show members
కనుక యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా లవ్ రొమాన్స్ కాస్త ఎక్కువగానే ఉండేలా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ మరియు సోషల్ మీడియా సెలబ్రిటీలను సెలక్ట్ చేయడమే ఇందుకు సాక్ష్యం అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఓటీటీ మాత్రం కచ్చితంగా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయం అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ఫిదా అవుతారు అంటున్నారు. రోజులో 24 గంటలు కూడా చూసే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఎంతో జాగ్రత్తగా నటిస్తూ కనిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. కనుక ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.