Home » Entertainment » Bigg Boss Telugu Ott Logo Promo Released
Entertainment

Bigg Boss OTT : బిగ్ బాస్ ప్రియుల‌కి గుడ్ న్యూస్.. ఓటీటీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 14, 2022, 8:00 pm
Advertisement

Bigg Boss OTT : బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షో అప్ర‌తిహ‌తంగా సాగుతుంది. ఇప్పటికే హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళంలోనూ బిగ్‏బాస్ రియాల్టీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో ఇటీవ‌ల సీజన్ 5 ముగియ‌గా, గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ నాగార్జున.. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ సందడి ఉంటుందని ప్రకటించారు. అన్న‌ట్టుగానే బిగ్‏బాస్ ఓటీటీ మొద‌లు పెడుతున్నారు. ఇకపై 24 గంటలు బిగ్‏బాస్ షోను వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో ఇటీవల తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ లోగో విడుదల చేశారు నిర్వాహకులు. తాజాగా వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు బిగ్‏బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు సర్‏ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు. నేరుగా బిగ్ బాస్ ఇంటి నుంచే ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్..అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ వేసిందిఈ షో త్వరలోనే షో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేశారు.

bigg boss telugu ott logo promo released

Advertisement

Bigg Boss OTT : ఓటీటీ గంట మోగింది…

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓటీటీ షోలో పాత కంటెస్టెంట్స్‌తో పాటు కొంద‌రు కొత్త వారు కూడా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్ రాజ్, అరియానా, అఖిల్ పాల్గోనబోతున్నారని సమాచారం. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో డీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, శ్రీహాన్ పాల్గోనబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి