Bigg Boss Telugu : బిగ్ బాస్‌ తెలుగు నిర్వాహకులు మామూలోల్లు కాదు.. వాళ్ల వీక్‌నెస్‌ వీళ్ల పెట్టుబడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 July 2022, 12:00 pm

Bigg Boss Telugu : ప్రపంచంలో ఎన్నో దేశాల్లో బిగ్ బాస్‌ షో నడుస్తోంది. బిగ్‌ బ్రదర్‌ గా కొన్ని దేశాల్లో నిర్వహిస్తూ ఉంటే కొన్ని దేశాల్లో మరో పేరుతో బిగ్‌ బాస్ షో ను కొనసాగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో బిగ్‌ బాస్ టెలికాస్ట్‌ అవుతోంది. హిందీలో పుష్కర కాలంకు పైగానే బిగ్ బాస్ షో రన్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అర పుష్కర కాలంగా బిగ్ బాస్‌ షో ను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు.. కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక ఇతర భాషల్లో ఒకరకంగా ఉంటే తెలుగు లో మరో రకంగా ఉంటుంది. భారీ పారితోషికాలు కంటెస్టెంట్స్ కు ఇవ్వాల్సి ఉంటుంది. కాని తెలుగు బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం కాస్త తేడాగా ఉంటుంది. గత రెండు మూడు సీజన్‌ ల విషయానికి వస్తే బిగ్‌ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో తెలివిని కనబర్చుతున్నారు. కొందరు సెలబ్రెటీ లు డబ్బుతో అవసరం లేకుండా బిగ్ బాస్ లో అడుగు పెట్టడం ను కోరుకుంటున్నారు. బిగ్‌ బాస్ లో అడుగు పెడితే మంచి పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ సెలబ్రెటీల వీక్ నెస్ ను వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బిగ్‌ బాస్ లో కంటెస్టెంట్‌ చేయాలంటే తమతో ఉచిత అగ్రిమెంట్‌ చేసుకోవాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Bigg Boss Telugu program interesting update

Bigg Boss Telugu program interesting update

ఎవరైతే బిగ్‌ బాస్ కోసం చాలా ఆసక్తిగా ఉంటున్నారో వారిలో కొదరిని తీసుకుని అవకాశం ఇస్తున్నారు. వారికి పారితోషికం ఇవ్వడం లేదు.. లేదంటే నామమాత్రపు పారితోషికం ఇస్తున్నారు. కొద్ది మంది సెలబ్రెటీలు మాత్రం కేవలం పారితోషికం కోసం వస్తున్నారు. వారికి అంతో ఇంతో పారితోషికం ఇస్తున్నారు. ఉచితంగా బిగ్‌ బాస్ లో ఉండటం వల్ల లాభం ఏంటా అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం వల్ల పబ్లిక్ లో మంచి పాపులారిటీ వస్తుంది. తద్వారా ఇన్ స్టా గ్రామ్‌ లో మంచి ఫాలోయింగ్‌ లభిస్తుంది. దాంతో ఆధాయం భారీగా వస్తుంది. అందుకే ఫ్రీగా బిబి హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది రెడీ…!

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి