Home » Entertainment » Bigg Boss Telugu Rahul Sipligunj Kaushal Manda And Shiva Balaji In One Frame
Entertainment

Bigg Boss Telugu: గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.. బిగ్ బాస్ రీ యూనియన్‌తో రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 30, 2021, 9:30 pm
Advertisement

Bigg Boss Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ రీ యూనియన్ పేరిట ఓ ఈవెంట్‌ను స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకుంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ప్రస్తుతం ఒకే చోటున్నారు. అది కూడా మూడు సీజన్ల కంటెస్టెంట్లు, మూడు సీజన్ల విన్నర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇది ఏ ఈవెంట్..ఎందుకు ఇలా కలిశారన్నది మాత్రం తెలియడం లేదు.

Advertisement

Bigg Boss Telugu Rahul Sipligunj Kaushal Manda And Shiva Balaji In One Frame

కాసేపటి క్రితమే కౌశల్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అందులో గీతా మాధురి, దీప్తి నల్లమోతు, భాను శ్రీ, సామ్రాట్, రోల్ రైడా వంటి వారున్నారు. బిగ్ బాస్ రీ యూనియన్ అని చెప్పాడు. మరో వైపు సామ్రాట్, గీతా మాధురి, కల్పన వంటి వారు సాయి కుమార్ వావ్ షోలోనూ పార్టిసిపేట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ అందరూ ఒకే చోట ఉన్నారా? లేదా ఒకే ఈవెంట్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు.

Advertisement

Bigg Boss Telugu: గట్టిగా ప్లాన్ చేస్తున్నారు..

ఇక ఇవన్నీ ఒకెత్తు అయితే మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ, రెండో సీజన్ విజేత కౌశల్, మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో బిగ్ బాస్ కన్ను బొమ్మ ఉంది. ఇదంతా చూస్తుంటే స్టార్ మా మరో కొత్త షోను ప్రారంభించబోతోన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.అయితే ఇందులో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి