Bigg Boss 5 Telugu season top contestent list
Bigg Boss 5 Telugu : స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో ఇప్పటివరకు 90 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 12 మంది ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా… ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. కాగా నేడు జరగబోయే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎవరో ఒకరు హౌస్ ను వీడనున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ప్రతిష్టాత్మకంగా జరిగే ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ మూడు రోజులు ఆధ్యంతం అలరించేలా సాగింది.
టాస్క్ లో గెలిచి విజేతగా నిలిచిన సింగర్ శ్రీ రామ చంద్ర.. మొదటగా టాప్ 5 లోకి వెళ్లి పోయాడు. అయితే మిగిలిన 7 సభ్యుల్లో ఒకరు నేడు ఎలిమినేట్ అవుతుండగా… మిగిలిన వారిలో ఫైనల్స్ లో ఎవరు ఉంటారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్ని రోజులు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే టాప్ 5 లో ఎవరు ఉంటారో ఈజీగా అంచనా వేయవచ్చు.మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యుల్లో ప్రియాంక సింగ్ నేడు హౌస్ ను వీడనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
Bigg Boss 5 Telugu season top contestent list
ఇదిలా ఉండగా ఫైనల్ కు చేరుకున్న శ్రీ రామ చంద్రతో పాటు సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్ లు టాప్ 3 రేస్ లో నిలుస్తారని.. నాలుగో పోటీ దారుగా మానస్ ఉంటారని అంతా అంచనా వేస్తున్నారు. మిగతా ఇద్దరు లేడీ కంటేస్టెంట్ లలో కాజల్ లేదా సిరి ఎవరో ఒకరు మాత్రమే ఫైనల్స్ కు అర్హత సాధిస్తారని అంతా భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు ఫైనల్స్ లో నిలుస్తారో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పోయిన వారం యాంకర్ రవి ఎలిమినేషనే అందుకు నిదర్శనం.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.