
naga chaitanya reaches new mile stone
Naga Chaitanya టాలీవుడ్ లో క్యూట్ పెయిర్ గా పేరొందిన అక్కినేని నాగ చైతన్య, సమంతాలు.. పెళ్లి చేసుకుని నాలుగేళ్లు కూడా నిండకముందే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. విడాకులు అనంతరం చైతన్య కానీ సమంత గానీ డైరక్ట్ గా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. వీరి అభిమానులు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేశారు. అసలు ఇలా ఎలా జరిగిందంటూ ఇప్పటికీ కొంతమంది ఆ వార్త నుంచి కోలుకోవడం లేదు. అయితే ఈ మాజీ భార్యా భర్తలు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా వరుస చిత్రాలకు సైన్ చేస్తూ ఎవరికీ వారు… వారి దారిలో దూకుడుగా వెళ్తున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్ దాటి బాలీవుడ్ చేరి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందిన సమంత ఏకంగా హాలీవుడ్ లో నటిస్తున్నానని ప్రకటిస్తూ సంచలనం సృష్టించింది. మరోవైపు ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ సినిమాతో హిట్టు కొట్టిన నాగ చైతన్య సైతం వరుస చిత్రాలకు సైన్ చేస్తూ బిజీగా మారుతున్నాడు. అయితే చైతూ కూడా సామ్ మాదిరిగా వైవిద్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఓ డేరింగ్ డిసీజన్ తీసుకున్నాడని తెలుస్తోంది. తాజాగా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో చైతు విలన్ రోల్ కు ఒప్పుకున్నాన్నాడట.
naga chaitanya going to act as villain Roles
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ను మనం ఫేం విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో చైతుకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది.యువ నటులు నాని, కార్తికేయ, రానా, నవీన్ చంద్ర లాగే తాను కూడా విలన్‌గా సత్తా చాటాలని చూస్తున్న చైతు ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చైతు బంగార్రాజు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దానితో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. అలాగే చైతు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ హీరోగా రాబోతున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.