Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్ పెళ్లి విష‌యంలో తెగ బాధ‌ప‌డుతున్న తండ్రి.. అస్స‌లు విన‌దంటూ కామెంట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss : బిగ్ బాస్ విన్న‌ర్ పెళ్లి విష‌యంలో తెగ బాధ‌ప‌డుతున్న తండ్రి.. అస్స‌లు విన‌దంటూ కామెంట్

 Authored By sandeep | The Telugu News | Updated on :25 May 2022,4:30 pm

Bigg Boss : బిగ్ బాస్ ఓటీటీ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 18 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో ర‌చ్చ చేయ‌గా, వారిలో బిందు మాధ‌వి విన్న‌ర్ కాగా, అఖిల్ ర‌న్నర్, టాప్ 3లో శివ నిలిచాడు. ఈ అమ్మ‌డు ట్రోఫీతో పాటు రూ.40 లక్షలు దక్కించుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ట్రోపీ అందుకున్న తొలి మహిళగా బిందు మాధవి నిలిచింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు..బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఆమెకు వచ్చింది. ప్రస్తుతం బిందు వరుస ఇంటర్వ్యలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిందు మాధవి పెళ్లిపై నెట్టింట చర్చ జరుగుతోంది. త్వరలోనే బిందు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా బిందు పెళ్లిపై ఆమె తండ్రి స్పందించారు. పెళ్లి గురించి తాము ఆలోచించడం లేదని, ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తామని చెప్పుకొచ్చాడు.అప్పట్లో చాలా మంచి సంబంధాలు వచ్చాయని… ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్, అమెరికా ఇంజినీరింగ్ సంబంధాలు వచ్చాయని… మంచి సంబంధాలు రావడంతో ఒక తండ్రిగా పెళ్లి చేసుకోవాలంటూ బిందుపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. అయితే పెళ్లికి ఆమె ఒప్పుకోలేదని… దీంతో, తాను కూడా బాధపడ్డానని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంబంధాలను చూశానని… అప్పుడు కూడా ఒప్పుకోలేదని తెలిపారు. తాను చిన్న పిల్లను కాదుకదా… తన మంచి చెడ్డలను తానే చూసుకుంటానని బిందు మాధవి చెప్పిందని ఆయన అన్నారు.తాను చెప్పినప్పుడు పెళ్లి చేయాలని అడిగిందని చెప్పారు. అప్పటి నుంచి పెళ్లి విషయాన్ని బిందుకే వదిలేశానని తెలిపారు.

bigg boss winner marriage clarity comes

bigg boss winner marriage clarity comes

Bigg Boss : భ‌లే క్లారిటీ ఇచ్చాడుగా..

ఇప్పుడు కాలం చాలా మారిపోయిందని… పిల్లల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలని చెప్పారు. ఇక నటరాజ్ మాస్టర్.. తనపైన తన కూతురిపైన చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ కౌంటర్ ఇచ్చారు బిందు మాధవి తండ్రి.. ‘‘కోపం కలిగిన వాడికి అవివేకం.. అవివేకం కలిగిన వాడికి స్థితిభ్రశం.. స్థితి భ్రశం వల్ల బుద్ధి నాశనం అని అవుతుంది కాబట్టి.. నీ కోపాన్ని క్రోదాన్ని తగ్గించుకో అని నటరాజ్ మాస్టర్‌కి చెప్పాను. నాకు ఎలాంటి కోపం, ఈర్శ్య, అహంకారం, ద్వేషం లేదని చెప్పాడు కానీ.. నెక్స్ట్ నామినేషన్స్‌లో మొదలుపెట్టాడు.. అతను నన్ను ఓ మాట అన్నాడు.. ఆ మాటకు నాకు అతనిపై జాలి కలిగింది. అంటూ నటరాజ్ మాస్టర్‌కి చురకలు వేశారు బిందు మాధవి తండ్రి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది