telugu bigg boss ott mumaith khan news clarity
Bigg Boss Telugu OTT : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మొన్నటికి మొన్నే పూర్తి అయ్యింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఆ సీజన్ గ్రాండ్ ఫినాలే అఫిషియల్ రేటింగ్ నిన్న మొన్ననే వచ్చింది. రికార్డు స్థాయి రేటింగ్ ను బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే దక్కించుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్ కొత్త సీజన్ అది కూడా ఓటీటీ గురించిన చర్చ మొదలు అయ్యింది. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అవుతుందని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ కొత్త సీజన్ ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ షో నిర్వాహకుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.అందుకు కారణం ఒమిక్రాన్ అంటున్నారు.
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి మరియు మార్చి అత్యంత కీలకం కాబోతున్నాయి. ఆ రెండు నెలలు కూడా పూర్తిగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతాయని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. తీసుకోకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా ఉన్నా కూడా ఒమిక్రాన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చేరుతుందని.. అలా ఒమిక్రాన్ బారిన పడటమే మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒమిక్రాన్ ప్రభావం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది.ఇంతకు ముందు వేరియంట్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి… ప్రాణాపాయం ఉండేది. కాని ఇప్పుడు మాత్రం ప్రాణాపాయం చాలా తక్కువ.. ఒమిక్రాన్ సోకి బాగు పడ్డ వారు మళ్లీ కరోనా బారిన పడే అవకాశాలు లేవు అంటున్నారు.
Bigg news about Bigg Boss Telugu ott due to covid 19
కనుక రాబోయే రెండు నెలల్లో అత్యంత కీలకంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను ఫిబ్రవరిలో మొదలు పెట్టక పోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు షో వాయిదా విషయమై కాని.. కంటెస్టెంట్స్ ఎంపిక విషయమై కాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే షో కు సంబంధించిన అధికారిక తేదీ కూడా రాలేదు. కనుక ప్రస్తుతం కు బిగ్ బాస్ ఓటీటీ గురించి ఏ వార్తలు వచ్చినా కూడా అవి ఆసకరంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న బిగ్ బాస్ ఓటీటీ ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఎందుకంటే ఇంతకు ముందు సీజన్ ల్లో రోజంతా జరిగిన ఎపిసోడ్ ను గంటలో చూపించే వారు.
కాని ఇప్పుడు రోజంత ఏం జరుగుతుంది అనే విషయాన్ని 24 గంటల డ్యూరేషన్ తో చూడవచ్చు. రకరకాలుగా ఓటీటీ లో ఈ సీజన్ ను స్ట్రీమింగ్ చేస్తారు. లైవ్ చూడాలి అనుకున్న వారు లైవ్ చూడవచ్చు.. ఎడిటింగ్ వర్షన్ చూడాలి అనుకున్న వారు ఎడిటింగ్ చూడవచ్చు. ఇన్ని రకాలుగా బిగ్ బాస్ ఓటీటీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బిగ్ బాస్ వంటి షో లైవ్ సాధ్యమా అంటే సాధ్యమే అంటూ ఈసారి తెలుగు ప్రేక్షకులకు ఆ ఫీల్ ను కలిగిస్తాం అంటూ నిర్వాహకులు బలంగా నమ్మకంగా చెబుతున్నారు. ఈ వాయిదా విషయం ఏమో కాని ఎప్పుడెప్పుడు షో ప్రారంభం అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే ఒమిక్రాన్ వల్ల బిగ్ బాస్ ఓటీటీ వాయిదా పడితే మళ్లీ ఎప్పటికి పునః ప్రారంభం అయ్యేనో అంటూ బిబి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.