biggboss 6 arohi eleminated these are the reasons
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం హౌస్ నుంచి ఆరోహి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో తేలాల్సిన ఎలిమినేషన్ గురించి ముందే లీక్ అవడంతో ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరో తెలిసింది. ఇస్మార్ట్ న్యూస్ తో పాపులర్ అయిన అంజలి అలియాస్ ఆరోహి ఈరోజు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది. హౌస్ లో ఆట మీద కన్నా సూర్యతో పులిహోర కలపడంలోనే బిజీ ఉంది ఆరోహి ( Arohi) .అంతేకాదు ఏం చేసినా సరే తనదే కరెక్ట్ అన్న పంథాలో ఆమె ఆట సాగింది. కెప్టెన్ మాట వినకుండా కూడా ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
అయితే ఇదే విషయంలో నాగార్జున (nagarjuna ) కూడా ఆమెని మందలించాడు. అయినా కూడా ఆరోహి తన ఆట మార్చుకోలేదు. ఫైనల్ గా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో పది మందిలో ఆరోహి కూడా ఉంది. ఇక ఈవారం ఓటింగ్ లో లీస్ట్ పర్సెంటేజ్ వచ్చిన హౌస్ మెట్ గా ఆరోహి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.సూర్యతో క్లోజ్ గా ఉన్నా ఆమె తన ఆటని తాను ఆడుకుంటే ఇంకా కొద్దిరోజులు ఉండేది. తన వాయిస్ పవర్ ని అవసరమైన ఆట విషయంలో ఉపయోగిస్తే బాగుండేది కానీ ఆరోహి అనవసరమైన విషయాల్లో తన వాయిస్ ని వినిపించింది. అందుకే ఆరోహి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
biggboss 6 arohi eleminated these are the reasons
ఆరోహి బిగ్ బాస్ హౌస్ నుంచి రావడంతో సూర్య ఆట తీరు మెరుగు పడే అవకాశం ఉంది. హౌజ్ లో సూర్య, ఆరోహి ఎమోషనల్ బాండ్ వారి మధ్య సీరియస్ రిలేషన్ షిప్ కి దారి తీసిందని టాక్ వచ్చింది. ఫైనల్ గా ఆరోహి మాత్రం తన అసలైన ఆట ఆడకుండానే వెనుతిరిగిందని చెప్పొచ్చు. మరి ఎలిమినేట్ అయినా ఆరోహి తన గురించి తాను ఎలా విశ్లేషించుకుంటుందో చూడాలి. అయితే బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం ఆరోహి ఎలిమినేషన్ కరెక్ట్ అని భావిస్తున్నారు. ఈమె వల్ల సూర్య ఆట కూడా పాడవుతుందని అంటున్నారు. మరి ఆరోహి ఎగ్జిట్ అయ్యింది కాబట్టి సూర్య ఆట మారుతుందా లేదా అన్నది చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.