Bimbisara Movie First Day Collections : ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన బింబిసార చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. చాలా రోజులుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నందమూరి కల్యాణ్ రామ్ బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. మొదటిరోజు ఏకంగా 11 కోట్లు సాధించి నందమూరి కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు చేసిన ఖర్చులో ఏకంగా 47శాతం మొదటిరోజే రికవరీ అయినట్లు తెలుస్తోంది.
సినిమాకి ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి శనివారం, ఆదివారం థియేటర్లకు అభిమానుల తాకిడి మరింత పెరిగి భారీ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్తా మీనన్‌లు నటించిగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. వశిస్ట్ కుమార్ దర్శకత్వం వహించారు. నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా 6.5 కోట్లు బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 13.50 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.1 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటితో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.
అమెరికాలో బింబిసార ప్రీమియర్లకు భారీగానే స్పందన కనిపించింది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 100k డాలర్లను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ 100K డాలర్లు వసూలు చేసినట్టయితే కల్యాణ్ రామ్ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్‌గా మారే అవకాశం ఉంది. 99 లొకేషన్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి 35,195 డాలర్స్ అంటే దాదాపు 27లక్షల 85వేల వరకు వచ్చాయని తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 6.3 కోట్లు రూపాయలు వచ్చాయి. యు.ఎస్‌లో రూ. 48 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 40 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. గ్రాస్ వసూళ్ల ప్రకారం రూ. 11.5 కోట్లు వచ్చాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.