sitaramam first day collections
Sita Ramam Movie First Day Collections : కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్ అనేది కరువు కాగా, ఇప్పుడు అందరి దాహాన్ని సీతారామం మూవీ తీర్చింది. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రం సీతారామం.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్ టాక్ పాజిటివ్‌గా రావడం, సినీ క్రిటిక్స్ అంతా భారీగా రేటింగ్స్ ఇవ్వడంతో మంచి ఓపెన్సింగ్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికాలో కూడా సీతారామం సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను 227 లొకేషన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్ల రూపంలో 90K డాలర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 100k వసూళ్లను సాధించింది. సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, 3 కోట్లకుపైగా షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చిత్ర యూఎస్ఏ ప్రీమియర్ కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దాదాపు 182 లొకేషన్స్‌లో విడుదలై ఈ చిత్రం 43 లక్షల 23 వేల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
sitaramam first day collections
సీతారామం సినిమా నైజాంలో అత్యధికంగా 5 కోట్లు, సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 70 లక్షలు, ఓవర్సీస్ 2.5 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.50 కోట్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.