Bimbisara Movie First Day Collections : బింబిసార జోరు మాములుగా లేదు.. బాక్సాఫీస్ వ‌ద్ద దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bimbisara Movie First Day Collections : బింబిసార జోరు మాములుగా లేదు.. బాక్సాఫీస్ వ‌ద్ద దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 August 2022,12:00 pm

Bimbisara Movie First Day Collections : ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ న‌టించి నిర్మించిన బింబిసార చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. చాలా రోజులుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నందమూరి కల్యాణ్ రామ్ బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. మొదటిరోజు ఏకంగా 11 కోట్లు సాధించి నందమూరి కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు చేసిన ఖర్చులో ఏకంగా 47శాతం మొదటిరోజే రికవరీ అయినట్లు తెలుస్తోంది.

Bimbisara Movie First Day Collections : బింబిసార భీబ‌త్సం..

సినిమాకి ఎలాగు పాజిటివ్ టాక్ వ‌చ్చింది కాబ‌ట్టి శనివారం, ఆదివారం థియేటర్లకు అభిమానుల తాకిడి మరింత పెరిగి భారీ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్తా మీనన్‌లు నటించిగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. వశిస్ట్ కుమార్ దర్శకత్వం వహించారు. నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా 6.5 కోట్లు బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 13.50 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.1 కోట్లు, ఓవర్సీస్‌లో 1 కోటితో మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.

Bimbisara Movie First Day Collections

Bimbisara Movie First Day Collections

అమెరికాలో బింబిసార ప్రీమియర్లకు భారీగానే స్పందన కనిపించింది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 100k డాలర్లను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ 100K డాలర్లు వసూలు చేసినట్టయితే కల్యాణ్ రామ్ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్‌గా మారే అవకాశం ఉంది. 99 లొకేషన్స్​లో విడుదలైన ఈ చిత్రానికి 35,195 డాలర్స్​ అంటే దాదాపు 27లక్షల 85వేల వరకు వచ్చాయని తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ. 6.3 కోట్లు రూపాయ‌లు వ‌చ్చాయి. యు.ఎస్‌లో రూ. 48 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా రూ. 40 ల‌క్ష‌లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల ప్ర‌కారం రూ. 11.5 కోట్లు వ‌చ్చాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది