Alia Bhatt : అందరూ చూస్తుండగా పబ్లిక్ లో రాత్రి అలియా భట్ చేసిన పనికి.. మీడియా షాక్..!!

Authored By aruna | The Telugu News | Updated on: July 16, 2023, 12:18 pm

Alia Bhatt : ప్రస్తుతం సోషల్ మీడియా హవా మాములుగా లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా ఏ రేంజ్ లో వైరల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వదిలిపెట్టదు. దాన్ని కచ్చితంగా వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేసిన పని ఇండస్ట్రీలో ఉండే జనాలకు తెగ నచ్చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అలియాభట్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

అలాగే మరోవైపు సినిమాలపరంగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ గా దూసుకెళుతోంది. అలియా భట్ త్వరలోనే ‘ రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె ముంబైలో ఓ ఏరియాకి తన తల్లితో వచ్చింది. దీంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫోటోలు తీసేందుకు ఆమె వెనుక పడ్డారు. అలియా కూడా వాళ్లని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అయితే అలా ఫోటోగ్రాఫర్ పరిగెడుతున్న క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ కాలి చెప్పు జారిపడిపోయింది. ఇది గమనించిన అలియా ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ చెప్పు ను తన చేతితో స్వయంగా తీసి ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకెళ్లి మరి ఇచ్చింది.

Bollywood beauty Alia bhatt night time video viral

Bollywood beauty Alia bhatt night time video viral

దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్ తన పాపులారిటీని ప్రదర్శించకుండా ఇలా చేయడం పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో నీలాంటి హీరోయిన్స్ ఉండాలి అంటూ ఆమె సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ అయిన అలియాభట్ ఏమాత్రం సంకోచించకుండా ఫోటోగ్రాఫర్ చెప్పును తీసి అతడి కాళ్ళ వద్ద వేశారు. నిజంగా ఇలా చేయడం గ్రేట్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా అలియా భట్ చేసిన పనికి ఇండస్ట్రీ వాళ్ళు తెగ మెచ్చుకుంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp