Nora Fatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి హాట్ వీడియో వైరల్
Nora Fatehi : నోరా ఫతేహి…. మనో హరీ.. మనో….హరి అంటూ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలిలో అడిపాడిన ఈ బాలీవుడ్ సుందిరీ తెలుగు వారికి కూడా సుపరిచితమే. డ్యాన్స్ లవర్స్ కి నోరా పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తన స్టైల్ లో అలరించింది. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అయిన తన స్టైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగొడుతుంటుంది నోరా ఫతేహి.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటలోనూ మెప్పించింది.ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది. 2016లో బిగ్ బాస్ 9లో డే 84లో తళుక్కుమన్న నోరా… టీవీ రియాల్టీ డాన్స్ షో ఝలక్ దిఖలా జా లో కూడా పాల్గొంది. తాజాగా టీ సిరీస్‌తో డీల్ కుదుర్చుకున్న ఫతేహీ టీ సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది.బాలీవుడ్ లో దిల్ బర్, సాకీ సాకీ లాంటి హాట్ సాంగ్స్ తో బీ టౌన్ లో క్రేజ్ సంపాధించుకుంది. యాక్టింగ్ పై మనసు పెట్టింది. భుజ్ మూవీలో కీలక పాత్ర పోషించింది.
జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన సత్యమేవ జయతే -2 లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది.కెనడా ఫ్యామిలీకి చెందిన నోరా ప్రస్తుతం తనది ఇండియన్ హార్టే అంటోంది. పుట్టి పెరిగిందంతా కెనడాలోనే అయినా బాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్‌లో రోర్, టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా తెలుగులో ఐటెమ సాంగ్స్ తో ఫెమస్ అయింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నోరా అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం నోరా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. లైట్ కలర్ గౌనులో ఫొటోలకు ఫోజులిస్తోంది ఈ అందాల బ్యూటీ.