Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 January 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘సంక్రాంతి సంబరాల’ డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జబర్దస్త్ కమెడియన్, లేడీ గెటప్ ఫేమ్ శాంతి స్వరూప్ ( Shanthi Swaroop ) గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మహిళతో అశ్లీల నృత్యాలు చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలను శాంతి స్వరూప్ తీవ్రంగా ఖండించారు.

Jabardasth Shanthi Swaroop YS Jagan లేడీకి లేడీ గెటప్‌కి తేడా తెలియదా ఎలా సీఎం అయ్యారు వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : అసలేం జరిగింది?

ఇటీవల తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మంత్రులు అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వీడియోను ప్రస్తావించారు. మంత్రి ఓ అమ్మాయిలో చిందులేశారని విమర్శించారు. దీనిపై తాజాగా ఆ వీడియోలో ఉన్న జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందించారు. ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ జగన్ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఎలా సీఎం అయ్యారు? శాంతి స్వరూప్ సూటి ప్రశ్న

“జగన్ గారు.. మీరంటే నాకు అభిమానం ఉంది. కానీ మీరు మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయి. మంత్రిగారు డ్యాన్స్ చేసింది ఏ అమ్మాయితోనో కాదు.. లేడీ గెటప్‌లో ఉన్న నాతో. లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండానే మీరు ఇన్నేళ్లు పరిపాలించారా? ఎలా సీఎం అయ్యారు? అని సోషల్ మీడియాలో జనం అడుగుతున్నారు” అంటూ శాంతి స్వరూప్ ఘాటుగా స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. “మీకు నేను వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. కానీ కనీసం మీ పక్కన ఉన్న నాయకులనైనా అడిగి ఉండాల్సింది. గతంలో మీ పార్టీ ఈవెంట్లలో కూడా నేను ప్రదర్శనలు ఇచ్చాను. రోజా గారినో, ఇతర నేతలనో అడిగితే ఆ వీడియోలో ఉన్నది అమ్మాయి కాదని చెప్పేవారు కదా” అని శాంతి స్వరూప్ ప్రశ్నించారు.

Jabardasth Shanthi Swaroop YS Jagan : అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు

జనవరి 15న రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయని, దానికి హైపర్ ఆది (Hyper Aadi) టీమ్ ని ఆహ్వానించారని శాంతి స్వరూప్ వివరించారు. వేలమంది ప్రజల సమక్షంలో జరిగిన ఆ సాంస్కృతిక కార్యక్రమంలో.. తామే మంత్రిని స్టేజ్ పైకి పిలిచామని, కళాకారుల కోరిక మేరకు ఆయన రెండు స్టెప్పులు వేశారని క్లారిటీ ఇచ్చారు. ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి చేసిన పనిని, అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్ అంటూ వక్రీకరించడం తగదని అన్నారు.

Jabardasth Shanthi Swaroop YS Jagan కళాకారుల పొట్ట కొట్టకండి

“మేము ఈవెంట్ల మీదే ఆధారపడి బతుకుతున్నాం. మీరు ఇలా అశ్లీలం అంటూ మాట్లాడితే.. మమ్మల్ని పిలవడానికి జనం భయపడతారు. మా ఉపాధి దెబ్బతింటుంది. దయచేసి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి” అని శాంతి స్వరూప్ విజ్ఞప్తి చేశారు.

మంత్రి సుభాష్ రియాక్షన్

మరోవైపు ఈ వివాదంపై మంత్రి వాసంశెట్టి సుభాష్  Vasamsetti Subhash  కూడా తీవ్రంగా స్పందించారు. కళాకారులకు, రికార్డింగ్ డ్యాన్సర్లకు తేడా తెలియని స్థితిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ ఎవరో తెలియకపోతే, పక్కనే ఉన్న రోజాను అడిగినా చెప్పేవారని కౌంటర్ ఇచ్చారు.

మొత్తానికి ‘లేడీ గెటప్’ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ వ్యాఖ్యలపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది