Brahma Mudi 18 Aug Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 18 ఆగస్టు 2023, శుక్రవారం ఎపిసోడ్ 178 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఉప్మా తిననంటే తినను అని రాజ్ బయటికి వస్తూ అక్కడ ఉన్న మట్టిలో వెళ్లి కాలు పెడతాడు. ఇంతలో మూర్తి, కనకం వచ్చి అయ్యో బాబు పొరపాటున కాలు పెట్టారా అంటే లేదమ్మా మేము ఇంట్లో ఏదైనా చేయాలనుకుంటే ముందు పనిని ఇలాగే ప్రారంభిస్తాం అంటూ కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది తొక్కాలా అంటాడు రాజ్. దీంతో లేదంటే తాతయ్య పర్మిషన్ తీసుకుంటారా అని అడుతుంది. దీంతో అవసరం లేదు. నేనే తొక్కుతా అంటాడు. మట్టి తొక్కుతూ ఉంటాడు. అబ్బాయి ఒక్కడే తొక్కుతున్నాడు. నువ్వు కూడా వెళ్లి తొక్కు అంటుంది కనకం. దీంతో అలాగే అమ్మ అని చెప్పి ఇద్దరూ వెళ్లి మట్టి తొక్కుతారు.
ఇద్దరూ కలిసి మట్టి తొక్కడం చూసి మూర్తి, కనకం ఇద్దరూ సంతోషిస్తారు. మరోవైపు కళ్యాణ్ మరో కవిత రాసేందుకు సిద్ధం అవుతాడు. అనామికను మెప్పించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. కవిత రాయడం స్టార్ట్ చేస్తాడు కానీ.. తనకు ఏదీ తోచదు. చాలా కష్టపడి మరీ ఒక కవిత రాయడం స్టార్ట్ చేస్తాడు కానీ.. అది కూడా నచ్చదు. రాసిన పేపర్లను అన్నింటినీ ముద్ద చేసి అక్కడ పడేస్తుంటాడు. వాటిని వచ్చి ఓ చెత్త వ్యక్తి ఏరుకుంటూ ఉంటాడు. దీంతో ఏయ్ బాబు ఇటురా అని చెప్పి ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగితే మీరు విసిరేసిన కాగితాలు ఏరుకుంటే అవి అమ్ముకుంటే నాకు కిలో బియ్యం అయినా వస్తాయి బాబు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటాడు. దీంతో నాకు ఈ ప్లేస్ సెట్ అవడం లేదు కానీ.. ఇదిగో ఈ 500 తీసుకొ అని చెప్తాడు.
కట్ చేస్తే.. చెత్త ఏరుకునే వ్యక్తి అనామిక దగ్గరికి వెళ్లి మేడమ్ మీరు చెప్పినట్టే అవన్నీ ఏరుకున్నా అని చెబుతాడు. దీంతో సరే అవన్నీ డిక్కీలో పెట్టు అని అతడికి కొన్న డబ్బులు ఇస్తుంది. మరోవైపు రాహుల్ కు ఓ రిపోర్టర్ ఫోన్ చేసి రాజ్, కావ్య ఇద్దరూ కలిసి మట్టి తొక్కుతున్న ఫోటోల గురించి చెబుతాడు. ఆ ఫోటోలు ముందు చూడండి. మనం లెక్కలు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఆ ఫోటోలను చూసి రాహుల్ ఫుల్ ఖుషీ అవుతాడు. తన తల్లికి కూడా చూపిస్తాడు. ఈ ఫోటోలను చూస్తే అందరూ షాక్ అవుతారు. మట్టి తొక్కుతున్న మహారాజ్ అని హెడ్ లైన్స్ లో వస్తుంది అంటాడు. వెంటనే ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయి అంటుంది.
మరోవైపు రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి మళ్లీ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడు. ఏరా.. మట్టి తొక్కుతూ ఆ రొమాన్స్ ఏంట్రా అంటాడు. ఇంకెప్పుడు ఆడగాలి తగులుతుంది అని ప్రశ్నిస్తాడు. నువ్వు, కళావతి ఇద్దరూ కలిసి అదే అంటాడు. ఇద్దరూ మింగిల్ అవ్వాలి అంటే అది ఎప్పటికీ జరగదు అంటాడు. మరోవైపు కావ్యను కృష్ణమూర్తి పిలుస్తాడు. నువ్వు ఇంటికి వెళ్లు అంటాడు. దీంతో ఈరోజు పూర్తి చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు అంటుంది కావ్య. అయితే ఏం నువ్వు ఇంటికి వెళ్లు ఏం కాదు అంటాడు మూర్తి.
నువ్వు ఇదివరకు అంటే మా కూతురువి.. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలివి. అందుకే వెళ్లు అంటారు. ఒకే ఒక్క విగ్రహం ఉంది అన్నా కూడా అప్పు వినదు. అదేం కుదరదు.. ఆటో తీసుకొచ్చా వెళ్లు అంటుంది అప్పు. అందరూ వెళ్లమని చెప్పేసరికి కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఏదో చెప్పబోతుండగా నువ్వు బయలుదేరు అంటూ తనను పంపించేస్తుంది అప్పు.
మరోవైపు సగం సగం రాసి పడేసిన ఆ పేపర్లు అన్నింటినీ తీసుకొని వాటిని చదువుతూ ఉంటుంది అనామిక. చదివి మురిసిపోతుంది. మరోవైపు రాజ్ తల్లి దగ్గరికి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే రుద్రాణి అక్కడ నిలబడుతుంది. దీంతో ఏంటి అని అడుగుతుంది. నీ కొడుకు మట్టి తొక్కడం ఎప్పుడైనా చూశావా అని అడుగుతుంది. మీడియా వాళ్లు రాసిన రాతలు చూడు.. అంటూ ఫోటోలు చూపిస్తుంది. దీంతో షాక్ అవుతుంది రాజ్ తల్లి. రుద్రాణి మొత్తానికి అనుకున్నది సాధిస్తుంది. పాపం రాజ్.. కావ్యను ఇంటి దగ్గర దింపడానికి వెళ్లి కావ్య చెప్పడంతో మట్టి తొక్కుతూ అడ్డంగా దొరికిపోయాడు. నేను ముందే చెప్పాను కావ్య నీ కొడుకును మాయలో వేసుకుంటుంది అని. కానీ.. నువ్వే వినలేదు. చివరికి ఏమైంది. రాజ్.. కావ్య గుప్పిట్లోకి వెళ్లిపోయాడు అంటుంది రుద్రాణి.
రాజ్ ని నువ్వు నీ కంట్రోల్ లోకి తెచ్చుకొవాలి అంటుంది. మరోవైపు కావ్య రాగానే కావ్య మీద చిరాకు పడుతుంది రాజ్ తల్లి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమవుతుంది. ఇంతలో రాజ్ వస్తాడు. మా అమ్మ మీదనే అరుస్తావా? అని చెప్పి ఇంట్లో నుంచి కావ్యను బయటికి వెళ్లగొడతాడు. తనను బయటికి వెళ్లగొట్టి లోపలికి వెళ్తాడు. డోర్ మూసేస్తాడు. మీరు ఏం చేసినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లను అంటుంది కావ్య. ఇంతలో భారీ వర్షం వస్తుంది. ఆ వర్షంలో కావ్య అలాగే నిలబడుతుంది. ఈ విషయం తెలిసి వెంటనే మూర్తి, కనకం ఇద్దరూ బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.