Brahmaji : నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలలోను విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ కూడా ఆయన తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ .. యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. “నాకు .. ‘శంకరాభరణం’ సినిమాకు సంబంధం ఉంది. ఆ సినిమా వల్లనే నేను సినిమాల్లోకి వచ్చాను. మా నాన్నగారు రెవెన్యూ డిపార్టుమెంటులో పనిచేసేవారు.
‘శంకరాభరణం’ విజయవంతమైన సందర్భంగా రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్లంతా కలిసి సోమయాజులు గారికి సన్మానం చేశారు. అందరూ ఆయనకి ఇచ్చే గౌరవం .. ఆయన కాళ్లపై పడిపోవడం చూశాను. ఒక ఆర్టిస్ట్ కి ఎంత గుర్తింపు ఉంటుందనేది దగ్గరగా చూసిన తరువాత సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. దాంతో చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాను. కెరియర్ ఆరంభంలో నాకు మంచి మంచి సినిమాలు .. పాత్రలు పడ్డాయి. గులాబీ .. సిందూరం .. నిన్నే పెళ్లాడుతా వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఆ తరువాత పదేళ్ల పాటు నేను ఆశించినస్థాయి పాత్రలు పడలేదు. ఆ సమయంలో నేను నిరాశపడ్డానుగానీ ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చానని బాధపడలేదు.
నటుడిగా 30 ఏళ్లను పూర్తిచేసుకోనున్నాను. అయినా నేను ప్రేక్షకులకు బోర్ కొట్టకపోవడానికి కారణం నేను ఎంచుకుంటూ వెళుతున్న విభిన్నమైన పాత్రలే. ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతాను” అని చెప్పుకొచ్చాడు. లవ్‌లో పడే వయసులోనే ప్రేమించాను. నా భార్య బెంగాళీ అమ్మాయి. నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆమె విడాకులు తీసుకుంది. ఓ బాబు కూడా ఉన్నాడు. మా ఇద్దరికీ పిల్లలు కూడా లేరు. పిల్లాడు ఉన్నాడు కదా. మరొకరు ఎందుకని అనుకున్నాం. బయట నుంచి చూసే వారు సొంత పిల్లలు గురించి మాట్లాడుతారు. కానీ నాకు సొంత పిల్లలు కావాలనుకునే ఆలోచనే రాలేదు అని బ్రహ్మాజీ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.