Brahmamudi 1 August Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఆగస్టు 2023, మంగళవారం ఎపిసోడ్ 163 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా ఇల్లు అమ్మేద్దాం.. రేపు ఇల్లు చూడటానికి ఒకరు వస్తున్నారు. వాళ్లు ఓకే అంటే అడ్వాన్స్ తీసుకొని ఆ 50 వేలు వాళ్లకు ఇచ్చేద్దాం అని అంటాడు కృష్ణమూర్తి. ఇవన్నీ విన్న అప్పు లేదు.. ఈ ఇల్లు అమ్మడానికి వీలు లేదు. నాన్న ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అని బాధపడుతుంది అప్పు. ముందు ఆ 50 వేలు కట్టేస్తే ఎలాగైనా తర్వాత కొంత సమయం ఉంటుంది. ఇల్లు అమ్మకుండా చూడొచ్చు అని అనుకుంటుంది. కట్ చేస్తే కావ్యను తీసుకొని ఆఫీసుకు వస్తాడు రాజ్. ఇంతలో శిరీష వాళ్ల దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. నీ సంగతి అంతా తెలిసింది. నీకు డిమోషనే అంటాడు రాజ్. ఆ తర్వాత క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అంటాడు మేనేజర్. ముందు నువ్వు ఎలా క్లయింట్స్ తో మాట్లాడాలో నేర్చుకో అని కొంత ట్రెయినింగ్ ఇస్తాడు రాజ్.
కట్ చేస్తే కళ్యాణ్, అప్పు ఇద్దరూ వాకింగ్ కు వెళ్తారు. అప్పు మూడీగా ఉండటం చూసి ఏమైంది బ్రో అని అడుగుతాడు. ఏం లేదులే అంటుంది అప్పు. ఇంతలో బైక్ మీద తన ఫ్రెండ్ వస్తాడు. నువ్వు అడిగిన డబ్బు అడ్జెస్ట్ అవ్వలేదు అంటాడు. వాడు హ్యాండిచ్చాడు. 5 వేలు అడ్జెస్ట్ అయింది. తీసుకో అంటాడు. ఇది తీసుకొని నేను ఏం చేయాలి. అప్పు తీరదు వద్దు అంటుంది. ఇవన్నీ కళ్యాణ్ వింటూ ఉంటాడు. అతడు వెళ్లిపోయాక.. ఏంటి అప్పు ఇది.. నన్ను హెల్ప్ అడగడం అంత నామూషీనా.. అప్పుగా అయినా ఇస్తాను అంటాడు కళ్యాణ్. దీంతో వద్దు మనం ఫ్రెండ్స్. మన మధ్య ఈ డబ్బు గొడవలు వద్దు అంటుంది. మరి నీ ప్రాబ్లమ్ అంటే అది నేను చూసుకుంటాను అంటుంది అప్పు.
మరోవైపు క్లయింట్స్ వస్తారు. కావ్యను చూసి ఆశ్చర్యపోతారు. మీరూ.. అంటే సాటి మనిషిని అంటుంది కావ్య. ఏమన్నారు అంటే.. ఏం లేదు కూర్చోండి అంటుంది కావ్య. దీంతో క్లయింట్స్ అందరూ కూర్చొంటారు. ఈ మీటింగ్ కు తనను ఎందుకు పిలిచానంటే.. అని రాజ్ అనబోతుండగా నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి అంటుంది కావ్య. మేము మిడిల్ క్లాస్ వాళ్లను క్యాప్ఛర్ చేయాలని అనుకుంటున్నాం అంటాడు క్లాయింట్.
మరి అంత కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్లు అఫర్డ్ చేయలేరు అంటాడు రాజ్. దీంతో లేదు.. మిడిల్ క్లాస్ వాళ్లకి కూడా మనం డిజైన్ చేయగలం అంటుంది కావ్య. మనం వాడే ఒక ఫెయిర్ నెస్ క్రీమ్.. చిన్న సాచెట్ రూపంలోనూ తీసుకొచ్చారు కదా. రూ.300 ఉండే ఫెయిర్ నెస్ క్రీమ్ 30 రూపాయలకు కూడా దొరుకుతుంది. అలాగే.. మిడిల్ క్లాస్ వాళ్ల కోసం చిన్న చిన్న డిజైన్స్ చేయొచ్చు. పెళ్లికైనా.. ఏ పండుగ అయినా.. ఏ వేడుక అయినా గోల్డ్ గిఫ్ట్ ఇస్తుంటారు. అలాంటి వాళ్లకు అందుబాటులో మనం జ్యూయలరీ తయారు చేయగలిగితే బెటర్ అంటుంది కావ్య.
నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి.. నాకు మిడిల్ క్లాస్ బాధలు తెలుసు. నేను డిజైనర్ ని కాబట్టి.. కొన్ని డిజైన్స్ చేసి మళ్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం అంటుంది కావ్య. దీంతో మాకు మీ ప్రపోజల్ ఓకే. ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నాం అంటారు.
కట్ చేస్తే కనకం ఇంటిని ఎవరో వచ్చి కొలుస్తుంటారు. ఎవరు మీరు అని అడుగుతుంది. దీంతో సీతారామ్ అనే వ్యక్తి వచ్చి నాపేరు సీతారాం. నాది ఇడ్లీ సాంబారు వ్యాపారం. అప్పుడప్పుడు ఇండ్లు కొంటుంటా అంటాడు. మూర్తి గారు ఇల్లు అమ్ముతున్నాం అని చెబితే వచ్చాను అంటాడు. ఇల్లంతా కలియ తిరిగి చూస్తాడు.
ఎక్కడ చూసినా మురికే కనిపిస్తోంది. మట్టి పని చేసుకునే వాళ్లు కదా. ఆ మాత్రం ఉంటుంది లేండి అని అంటాడు. పిల్లర్ కి వయసు అయిపోయింది మూర్తి గారి లాగే అంటాడు. అప్పు ఏదో అనబోతే మూర్తి ఆపుతాడు. మీరు ఫోన్ లో తాజ్ హోటల్ రేంజ్ లో చెప్పారు. కానీ.. ఇక్కడ చూస్తే కాకా హోటల్ రేంజ్ కూడా లేదు అంటాడు సీతారామ్. కానీ.. ఈ ఇంటికి రూ.20 లక్షలే ఇవ్వగలను అంటాడు సీతారామ్. దీంతో అదేంటి దీని విలువ రూ.50 లక్షలు అంటాడు మూర్తి.
మీ ముఖాలు చూసి ఇంకో రెండు లక్షలు పెంచుతా. రూ.22 లక్షలు లాస్ట్ అంటాడు. దీంతో అంత తక్కువకి ఇల్లు అమ్మడం కుదరదు. మీరు ఇక బయలుదేరండి అంటుంది అప్పు. కానీ.. మూర్తి మాత్రం మేము ఆలోచించుకొని చెబుతాం అంటాడు. మరోవైపు కావ్య ఆఫీసు నుంచి ఇంటికి రాగానే.. మీ ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు వదిన అని చెబుతాడు కళ్యాణ్.
50 వేలు అర్జెంట్ గా కట్టాలని తెలిసింది అంటాడు కళ్యాణ్. ఏదో ఇల్లు తాకట్టులో ఉన్న విషయం గురించే టెన్షన్ గా ఉన్నారు అని అంటాడు కళ్యాణ్. 50 వేలా.. అంత డబ్బు ఎలా అని అంటుంది కావ్య. దీంతో ఆ డబ్బు నేను ఇస్తాను అంటాడు కవి. దీంతో వద్దు కవి గారు అంటుంది కావ్య. నేనే ఎలాగోలా సర్దుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది కావ్య. తన రూమ్ లోకి వెళ్తుంది. అసలు వీళ్లు ఏం మాట్లాడుకున్నారు అని టెన్షన్ పడతాడు రాజ్.
మరోవైపు స్వప్న ఏవో ట్యాబ్లెట్స్ తెప్పించుకొని వేసుకోవడం చూస్తుంది రుద్రాంగి. తను లేనప్పుడు రూమ్ లోకి వెళ్లి ఆ ట్యాబ్లెట్స్ ఏంటని చూస్తుంది. నువ్వు ఈ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నావు ఏంటి.. అంటే నీకు ప్రెగ్నెన్సీ లేదా అని అడుగుతుంది. రాహుల్ కూడా వచ్చి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.