Brahmamudi 11 Sep Monday Episode Highlights : తాతయ్య కోసమే నేను కావ్యతో మంచిగా ఉంటున్నా.. రాజ్ మాటలు విన్న కావ్య ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Advertisement

Brahmamudi 11 Sep Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 11 సెప్టెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 198 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేంటి పూలు పెట్టుకొని పాలు తీసుకొని వచ్చావు అంటూ అడుగుతాడు. తనను చూసి భయపడతాడు. మరి ఇవన్నీ ఏంటి అంటే.. అమ్మమ్మ గారు తలలో పూలు పెట్టారు. చిన్నత్త గారు పాల గ్లాస్ ఇచ్చారు అని చెబుతుంది కావ్య. దీంతో హమ్మయ్య అనుకుంటాడు రాజ్. మరోవైపు అనామిక గురించే ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. అనామికకు ఎలా తన లవ్ విషయం చెప్పాలా అని అనుకుంటాడు. ఏదైనా సలహా ఇస్తుందేమో అని అప్పుకు కాల్ చేస్తాడు కళ్యాణ్. బ్రో ఒక 5 మినట్స్ నీతో మాట్లాడాలి అంటాడు. దీంతో నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను అంటుంది.

Advertisement
brahmamudi 11 september 2023 monday episode highlights
ammamma

దీంతో ప్లీజ్ బ్రో.. ఒక్క 5 నిమిషాలు నీతో మాట్లాడాలి అంటాడు. ఇంతలో అనామిక కాల్ చేస్తుంది. దీంతో ఫోన్ కట్ చేసి అనామిక పోన్ ఎత్తుతాడు. అనామిక ఫోన్ ఎత్తి ఏంటి మీ ఫోన్ బిజీ వస్తోంది అంటుంది. దీంతో బ్రోతో మాట్లాడుతున్నా అంటాడు కళ్యాణ్. ఎప్పుడు చూసిన ఆమెతోనే ఉంటావు. నీకు మగ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరా అంటే.. ఎవ్వరూ లేరు అంటాడు. మరోవైపు అప్పు రివర్స్ లో కాల్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ కు. బిజీగా వస్తుంటుంది కళ్యాణ్ ఫోన్. మరోవైపు రాహుల్ కారులో వెళ్తుంటే చూస్తుంది కనకం. వెంటనే రుద్రాంగికి పోన్ చేసి రాహుల్ ఏంటి ఇక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. దీంతో రాహుల్ ఇక్కడ ఉండటం ఏంటి.. నువ్వు నీ కూతురుతో మాట్లాడటం లేదా? వాళ్లు ఉన్నది ఊటీలో కదా అంటుంది. దీంతో అవును.. నా కూతురుతో మాట్లాడుతున్నా? నిన్ననే మాట్లాడా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే రుద్రాణి.. రాహుల్ కు కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దీంతో హోటల్ లో అని అబద్ధం చెబుతాడు. నువ్వు కారులో కనిపించావని ఆ కనకం ఫోన్ చేసి చెప్పింది. మనం చేసే పని పూర్తయ్యేలోపు బయటికి రాకు అని చెబుతుంది రుద్రాణి.

Advertisement

Brahmamudi 11 Sep Monday Episode Highlights : కృష్ణుడి పూజ చేసిన కావ్య

కట్ చేస్తే ఇంట్లో కృష్ణుడి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది కావ్య. బాలకృష్ణుడిని పిలుస్తే నీ గోపాలకృష్ణుడే వచ్చాడు అని అంటుంది అమ్మమ్మ. దీంతో ఏంటిది ఇంటిని భజన మందిరంగా మార్చేశారు అంటుంది. దీంతో రాజ్ కి కోపం వస్తుంది. తను పూజే కదా చేసింది. అందులో తప్పేముంది. ఇల్లు భజన మందిరంలా కనిపిస్తే మీరు మీ రూమ్ లోనే కూర్చోండి. ఎవరు వద్దన్నారు అంటాడు రాజ్. అందరూ రుద్రాణి మాటలకు సీరియస్ అవుతారు. దీంతో రుద్రాణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు.

తర్వాత రాజ్, కావ్య ఇద్దరూ కలిసి కృష్ణుడికి పూజ చేస్తారు. కృష్ణయ్య నా భర్త మనసు మారుతోంది. మా అత్తయ్య మనసు కూడా మారి నన్ను కోడలుగా అంగీకరించేలా చేయి స్వామి అని మొక్కుకుంటుంది కావ్య. మరోవైపు కనకం ఇంట్లో కూడా కృష్ణుడికి పూజలు చేస్తారు.

మరోవైపు మాకు ఇలాంటి బ్రహ్మముడిని ఎందుకు వేశావు దేవుడా అని నాలో నేనే బాధపడ్డాను కానీ.. ఈరోజు నాకు నమ్మకం వచ్చింది. నేను ఈ ఇంటి కోడలునే అని. అని అమ్మమ్మతో చెబుతుంది కావ్య. అవి అపర్ణ వింటుంది. వెంటనే రాజ్ ను తీసుకొని రూమ్ లోకి వెళ్లి వరలక్ష్మీ వ్రతం రాత్రి నుంచి నీ ప్రవర్తన, నువ్వు చేసే పనులు, నువ్వు కావ్యతో ఉండే తీరు మొత్తం మారిపోయింది. తనంటే నీకు ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతుంది అపర్ణ. దీంతో తాతయ్య కోసం మమ్మీ అంటాడు రాజ్. ఆ మాటలు కావ్య వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement