#image_title
Brahmamudi 15 Sept Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 సెప్టెంబర్ 23, శుక్రవారం ఎపిసోడ్ 201 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మళ్లీ ఇంట్లో గొడవ పెట్టడానికి రుద్రాణి రెడీ అయి అపర్ణతో లేనిపోనివి చెబుతుంది. నువ్వు డబ్బులు ఇవ్వను అని చెబితే ఆ కావ్య మాత్రం పనిమనిషికి డబ్బులు ఇస్తోంది అని చెబుతుంది. దీంతో అపర్ణకు కోపం వస్తుంది. అసలు నువ్వెవరు డబ్బులు ఇవ్వడడానికి అని అడుగుతుంది. నీకేం హక్కు ఉంది అంటే.. ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది అని అనుకుంటున్నాను. అందుకే డబ్బులు ఇవ్వాలనుకున్నాను అని కావ్య చెప్పబోగా.. నువ్వు నేను ఒకటేనా.. నీకు ఎంత ధైర్యం నాతో పోల్చుకోవడానికి అంటుంది. అవసరం ఉంటే డబ్బు ఇస్తే దానికి సంబంధం ఏంటి అంటుంది కావ్య. ఒక మంచి పనికి డబ్బులు ఇస్తే తప్పేంటి అంటుంది కావ్య. అది నీ డబ్బు కాదు కదా. నువ్వు సంపాదించింది కాదు. నీ కుటుంబం ఇచ్చింది కాదు. రాజ్ ఇచ్చిన డబ్బే కదా అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ.
#image_title
ఇందిరాదేవి కూడా కావ్యనే తప్పు పడుతుంది. మీ అత్తయ్య ఇవ్వను అంటే నువ్వెందుకు ఇచ్చావమ్మా అని ఇందిరా దేవి కావ్యను అంటుంది. దీంతో అయ్యో అమ్మమ్మ.. అసలు మా అత్తయ్య గారు డబ్బులు ఇవ్వను అని చెప్పిన విషయం నాకు నిజంగా తెలియదు అంటుంది. దీంతో రుద్రాణి ఇన్వాల్వ్ అవుతుంది. మీ అత్తయ్య డబ్బులు ఇవ్వను అన్న విషయం నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు డబ్బు ఇచ్చావు. ఈ ఇంట్లో నీకు కూడా అధికారం ఉంది అని తెలియజేయడం కోసమే నువ్వు అలా చేశావు.. అంటూ రుద్రాణి అగ్నికి ఆజ్యం పోస్తుంది. వీళ్లు ఇలాంటి వాళ్లు.. ఇలా చేస్తారు అని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఆరోజే ఇంట్లోకి రానివ్వను అని చెప్పా అంటుంది అపర్ణ.
ఆ తర్వాత అపర్ణ.. చివరకు తన భర్తపై కూడా చిరాకు పడుతుంది. మీరే బాగా అలసు ఇచ్చారు అంటూ సుభాష్ ను అంటుంది. దీంతో నువ్వు రుద్రాణి చెప్పే మాటలు నమ్ముతున్నావా అండు సుభాష్. అంటే.. మీరు మీ కోడలు మాటలు నమ్ముతున్నారా అని అడుగుతుంది అపర్ణ. అసలు నువ్వు ఈ చెప్పుడు మాటలు ఎప్పటి నుంచి నమ్ముతున్నావు అంటాడు సుభాష్. దీంతో ఒకరు చెప్పే మాటలు వినేంత అమాయకురాలిని కాదు నేను.. అంటుంది అపర్ణ.
ఇంతలో రుద్రాణి మళ్లీ కల్పించుకొని ఈ పని మనిషి వల్ల నేను ఇంట్లో మాటలు పడాల్సి వస్తోంది. నీకు డబ్బే కదా కావాలి.. ఇదిగో అని కావ్య చేతుల్లో ఉన్న డబ్బును తీసుకొని పనిమనిషికి ఇస్తుంది రుద్రాణి. నా వల్ల గొడవ వద్దు. నాకు వద్దు ఈ డబ్బులు అంటే.. గొడవ డబ్బు గురించి కాదు. నువ్వు డబ్బులు తీసుకో అని కావ్య చెప్పడంతో ఆ డబ్బులు తీసుకొని పనిమనిషి వెళ్తుంది. డబ్బుల గురించి గొడవ కాదు అంటే మరి దేని గురించి గొడవ అంటూ మళ్లీ అపర్ణ రెచ్చిపోతుంది.
అసలు ఇది నా భర్త డబ్బు. నా భర్త డబ్బు నేను ఇస్తే అందులో తప్పేం ఉంది. అసలు నేను మాట్లాడే మాటలు కూడా వినడానికి మీరు సిద్ధంగా లేదు. మీరు డబ్బులు ఇస్తే అమ్మమ్మ గారు కూడా ఇలాగే నిలదీసేవారా? అంటూ కావ్య సీరియస్ అవుతుంది. దీంతో నా కొడుకు నీకు భర్త.. అంతమాత్రాన ఇక వాడు నా కొడుకు కాడా.. వాడి మంచితనం చూసి ఇలా నీ కుటుంబానికి, పనిమనిషికి దోచిపెడుతున్నావు అంటుంది అపర్ణ.
ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో.. నాకు కూడా అంతే హక్కు ఉంది అంటుంది అపర్ణ. దీంతో నువ్వు నేను ఒకటేనా.. నువ్వెంత, నీ బతుకెంత అంటూ తన మీద చేయి ఎత్తబోగా వెంటనే వచ్చిన రాజ్ తల్లిని అడ్డుకుంటాడు. చేయి దించు మమ్మీ అంటాడు. అసలు దుగ్గిరాల ఇంట్లో ఇంతవరకు ఎవరిపై ఎవరూ చేయి చేసుకోలేదు. కళావతిపై నువ్వు చేయి ఎత్తడం కరెక్ట్ కాదు. నేను ఇవ్వమంటేనే కావ్య డబ్బులు ఇచ్చింది.. అంటాడు రాజ్.
కావ్యను అన్ని మాటలు అన్నందుకు ఇందిరాదేవి కూడా అపర్ణపై చేయి చేసుకుంటుంది. సుభాష్ కూడా అపర్ణపైనే ఫైర్ అవుతాడు. అసలు రుద్రాణి రెచ్చగొడుతుంటే నువ్వెందుకు అంతలా ఆవేశపడుతున్నావు అని ధాన్యలక్ష్మి కూడా చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Uppal : రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం పేదలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని…
Altaf Lalli : పహల్గామ్‌లో Kashmir Pahalgam అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు…
Hyderabad : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కఠినతరం అయ్యాయి. 26…
Pakistan : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందిస్తుంది. అందులోభాగంగా సింధూ జలాలపై చేసుకున్న…
Deposit New Rules : ఇప్పటి నుండి బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలంటే కొన్ని కఠిన నిబంధనలను…
kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లష్కర్ ఎ తోయిబా…
Hyper Aadi Marriage : హైపర్ ఆది Hyper Aadi .. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి…
This website uses cookies.