Brahmamudi 19 Sep Tuesday Episode : ఆ ఒక్క మాటతో అపర్ణను మార్చేసిన కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీ షాక్.. రాజ్‌కి కూడా దగ్గరైన కావ్య | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Brahmamudi 19 Sep Tuesday Episode : ఆ ఒక్క మాటతో అపర్ణను మార్చేసిన కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీ షాక్.. రాజ్‌కి కూడా దగ్గరైన కావ్య

Brahmamudi 19 Sep Tuesday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సెప్టెంబర్ 19, 2023 మంగళవారం ఎపిసోడ్ 205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా కళ్యాణ్ కు ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది అనామిక. కానీ.. కళ్యాణ్ ముద్దపప్పు కదా.. ఏం చేయాలి. ఎంత చెప్పినా కూడా కళ్యాణ్ అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటుంది అనామిక. తన నాన్న కూడా అనామికతో అతడికి ప్రపోజ్ చేయి అంటాడు. దీంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 September 2023,9:00 am

Brahmamudi 19 Sep Tuesday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సెప్టెంబర్ 19, 2023 మంగళవారం ఎపిసోడ్ 205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా కళ్యాణ్ కు ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది అనామిక. కానీ.. కళ్యాణ్ ముద్దపప్పు కదా.. ఏం చేయాలి. ఎంత చెప్పినా కూడా కళ్యాణ్ అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటుంది అనామిక. తన నాన్న కూడా అనామికతో అతడికి ప్రపోజ్ చేయి అంటాడు. దీంతో కళ్యాణ్ కు మెసేజ్ చేస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి. రేపు కేప్ కు రా అంటుంది. ఎలాగైనా రేపు ఖచ్చితంగా కళ్యాణ్ కు ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది అనామిక. లైఫ్ కు సంబంధించిన మ్యాటర్ అంటే ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుంది అని అనుకుంటాడు కళ్యాణ్.

brahmamudi 19 september 2023 tuesday full episode

#image_title

అందరూ అన్నం తింటుంటే అపర్ణ మాత్రం తనకు తానే వేరే భోజనం వండుకొని మరీ తింటుంది. ఈ ఇంటికి నువ్వే మార్గదర్శివి. కానీ.. నువ్వే ఇలా చేస్తే ఎలా అంటాడు తాత. కానీ.. ఆయన మాట కూడా వినదు అపర్ణ. నేను ఇప్పుడు అందరి ముందు నటించలేను. ఏమండి.. మీకు కూడా కలిపే వండాను. రండి.. భోం చేద్దాం అంటుంది అపర్ణ. దీంతో రాజ్.. వద్దు నాన్న మీరు వెళ్లకండి అంటాడు రాజ్. దీంతో సుభాష్ నేను రాను. నేను ఈ ఇంటి పెద్దకొడుకును. నువ్వు చెప్పినట్టు మాత్రం చేయలేను అంటాడు సుభాష్. అంటే మీరు కూడా మీ కోడలు వైపే అన్నమాట. ఎవరు నా వైపు ఉన్నా లేకపోయినా నా నిర్ణయం మాత్రం మార్చుకోను అంటుంది అపర్ణ. దీంతో అయితే నువ్వు దానితో పాటు మరో నిర్ణయం కూడా తీసుకోవాల్సిందే అంటుంది ఇందిరా దేవి.

Brahmamudi 19 Sep Tuesday Episode : ఇందిరాదేవితో తన తల్లి గురించి మాట్లాడిన రాజ్

ఇంతలో ఇందిరా దేవి ఆస్తి పేపర్లు పట్టుకొచ్చి అక్కడ సంతకం పెట్టు అంటుంది. విడిపోవాలి అని అనుకున్నప్పుడు వంటింట్లో మాత్రమే ఎందుకు ఇంట్లో కూడా విడిపోవాలి. ఆస్తులు పంచుకొని ఎవరికి వారు విడిపోండి అంటుంది ఇందిరా దేవి. దీంతో అందరూ షాక్ అవుతారు. కలిసి ఒకే ఇంట్లో ఉండి ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తించడం ఎందుకు.. విడిపోవాలి అనే ఆలోచన క్యాన్సర్ లాంటిది. ఒకసారి వస్తే అది శరీరం అంతా పాకినట్టు విడిపోవాలి అనే ఆలోచన ఒక్కరికి వచ్చినా అది అందరిలో పాకుతుంది. బావ వచ్చి సంతకం పెట్టు. అందరికీ ఆస్తులు పంచి మనం ఏ కాశీకో వెళ్లిపోయి అక్కడైనా ప్రశాంతంగా బతుకుదాం అంటుంది ఇందిరా దేవి.

ఇక్కడ నా బాధను వ్యక్తపరిచే అవకాశం కూడా లేదా అని అపర్ణ బాధపడుతుంది. అందరూ భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాజ్ మాత్రం అపర్ణ దగ్గరికి వెళ్లి మమ్మి ఒక్కసారి మీరు అంటూ ఏదో మాట్లాడబోగా.. కళ్లు ఉరుముతూ చూస్తుంది. దీంతో ఏం మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజ్. సుభాష్ తన దగ్గరికి వెళ్లి నేనెప్పుడూ నీ వైపే ఉన్నాను. కానీ అదే నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీ వైపే ఉంటా. కానీ.. ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు సుభాష్.

అందరూ వెళ్లిపోయారు. నేను అనుకున్నదే జరిగింది.. అని మనసులో సంతోషపడుతుంది రుద్రాణి. ఆస్తి పేపర్స్ చూపిస్తే నేను మనసు మార్చుకుంటానా? ఎవరు ఎన్ని చెప్పినా నేను నా మనసు మార్చుకోను. ఎవరు తిన్నా తినకున్నా నేను తింటాను అని ప్లేట్ లో భోజనం పెట్టుకొని తినబోతూ.. అక్కడే ఉన్న కావ్యను చూసి తినకుండానే వెళ్లిపోతుంది అపర్ణ.

రాజ్ వెళ్లి ఇందిరా దేవితో మాట్లాడుతాడు. నాకు చాలా భయంగా ఉంది నానమ్మ అంటాడు. దీంతో మీ అమ్మ నీతో మాట్లాడటం లేదనా అంటే.. కాదు నానమ్మ.. అమ్మను చూస్తుంటేనే భయమేస్తోంది. అమ్మకు విడిపోవాలనే ఆలోచన రావడం ఏంటి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి.. ముందు ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయమేస్తోంది అంటాడు రాజ్. తన వైపు ఎవ్వరూ నిలబడలేదని ఆ నిర్ణయం తీసుకుంటుంది అంటుంది ఇందిరా దేవి.

కళావతి ఏ తప్పు చేయనప్పుడు కళావతి తప్పు చేసిందని నేను ఎలా అనగలను.. అమ్మను నేను ఎలా ఆపగలను.. అంటాడు రాజ్. కనిపెంచిన తల్లి కాబట్టి ఏం జరిగినా తనవైపే ఉంటాడు అని అనుకుంది అంటుంది ఇందిరా దేవి. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే అంటుంది ఇందిరా దేవి. మరోవైపు అపర్ణ దగ్గరికి వెళ్తుంది కావ్య. తనను చూసి అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా ఎవరైనా చూస్తే నా మొహం చూడటం ఇష్టం లేక వెళ్తున్నారు అని అనుకుంటారు. మీతో మాట్లాడాలి అంటుంది కావ్య.

దీంతో నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటే.. కనీసం వినాల్సిన అవసరం అయినా ఉంది అంటుంది కావ్య. మీరు ఎలాగూ నేను చెప్పేది వింటున్నారు నాతో మాట్లాడుతున్నారు కూడా. మీరంటే నాకు చాలా గౌరవం. మీరు పనిమనిషి విషయంలో తీసుకున్న నిర్ణయం నిజంగా నాకు తెలియదు. తెలిసుంటే మీ నిర్ణయాన్ని కాదని నేనెందుకు అలా చేస్తాను అంటుంది కావ్య.

దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడొచ్చి నువ్వు అమాయకురాలివి అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. నీ స్థానం పదిలంగానే ఉంది కదా అంటుంది అపర్ణ. ఇప్పటి వరకు ఎవ్వరూ మిమ్మల్ని దాటి నన్ను ఒప్పుకున్నది లేదు. ఇప్పుడు మీరు నన్ను దూరం పెడితే ఇప్పుడు మీరు మీ కుటుంబానికి దూరంగా వేరు కుంపటి పెడితే వాళ్ల దగ్గర నాకు కావాల్సిన సింపతి నాకు దొరుకుతుంది అని అంటుంది కావ్య.

మీ అబ్బాయి కూడా నా తప్పు లేదని అర్థం చేసుకున్నారు.. సమర్థించారు కాబట్టి ఆయన నాకే దగ్గరైపోతారు అంటుంది కావ్య. దీంతో తెల్లవారగానే ఇంత పొద్దుపోయింది ఒక్కరికైనా కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది అపర్ణ. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రెడీగా ఉంది ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అంటుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది