Brahmamudi 5 Sept Today Episode : ఫలించిన కావ్య కల.. కావ్య నెత్తి మీద అక్షింతలు వేసి దీవించిన రాజ్.. ఇద్దరూ మళ్లీ ఒక్కటయినట్టేనా?

Brahmamudi 5 Sept Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 సెప్టెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 193 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాతయ్య రాజ్ ని పిలిచి కావ్య ఉపవాసం వదిలేసింది. తనను ఆశీర్వదిస్తేనే భోజనం చేస్తుందని చెబుతాడు. అందరి ముందు చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. దీంతో సరే అని తన దగ్గరికి వెళ్లబోతాడు రాజ్. ఇంతలో తన బ్యాగు సర్దుకొని ఇంటికి వెళ్లబోతుంటుంది కావ్య. ఎక్కడికి అంటే.. రైలు దిగి తన ఇంటికి వెళ్లిపోతున్నా అంటుంది. దీంతో నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అంటాడు రాజ్. నాణేనికి రెండో వైపు ఉన్నట్టు మీరు అటువైపు ఏం అనుకుంటన్నారో నాకెలా తెలుస్తుంది అంటుంది కావ్య. దీంతో ఎందుకు అంటే వెళ్లొద్దు అంటున్నా కదా అంటాడు. ఒక వస్తువుగా పడి ఉండమంటారా అంటుంది. దీంతో ఇన్ని రోజులు ఎదురు చూశావు. ఇంకొన్ని రోజులు ఎదురు చూడు అంటాడు.

#image_title

ఇన్ని రోజులు జరగనిది ఇప్పుడు జరుగుతుందా? మీరు నన్ను మీ భార్యగా అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తుంది కావ్య. లేదంటే నాకు ఈ ఒంటరి జీవితం అలవాటు అవుతుందా? ఇన్ని రోజులు ఎప్పుడు నేను బయటికి వెళ్తా అని అనుకున్నవాళ్లు ఇప్పుడెందుకు ఆపుతున్నారు అంటే.. నువ్వు అడిగిన ప్రశ్నలకు మూడు నెలల్లో సమాధానం దొరుకుతుంది అంటాడు రాజ్. నువ్వు నాతో ఉండు. ఇంట్లో ఉండు. నీలో సంతోషం కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను అంటాడు రాజ్. నేను నమ్మలా.. వెళ్లాలా అంటే ఉండమంటున్నాను అంటాడు. దీంతో నీకు నమ్మకం కలగాలి అంతే కదా. నాతో రా అని చెప్పి తనను అందరి దగ్గరికి తీసుకెళ్తాడు రాజ్. తాతయ్య ముందు కావ్యను ఆశీర్వదిస్తాడు రాజ్. రాజ్ కాళ్లు మొక్కుతుంది కావ్య. దీంతో రుద్రాణికి కోపం వస్తుంది. తన మీద అక్షింతలు వేస్తాడు రాజ్.

తాతయ్య గారు నా వ్రతం అసంపూర్ణంగా మిగిలిపోతుందని చాలా భయపడ్డాను. కానీ ఆ అమ్మవారే మీ రూపంలో ఉండి నా సంకల్పాన్ని పూర్తి చేసి నా వ్రతాన్ని సంపూర్ణం చేశారు. ఇంతకన్నా గొప్ప వ్రతఫలం నాకు ఇంకేం అవసరం లేదు తాతయ్య అంటుంది కావ్య. ఇద్దరూ తాతయ్య ఆశీర్వాదం తీసుకోండి అంటాడు సుభాష్. దీంతో ఇద్దరూ తాతయ్య, నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నకు ఇదంతా చూసి కోపం వస్తుంది. మీ ఇద్దరినీ కలిపిన బ్రహ్మముడి చివరి వరకు విడిపోదు అంటాడు తాతయ్య. ఇక ముందు ఎవరు విడదీయాలని చూసినా వాళ్లకు భంగపాటు తప్పదు.. నేను అమ్మవారి సాక్షిగా చెబుతున్నా అంటాడు తాతయ్య.

Brahmamudi 5 Sept Today Episode : కృష్ణుడిని వేడుకున్న కావ్య

రాజ్ తనను ఆశీర్వదించడం అపర్ణకు అస్సలు నచ్చదు. కావ్యను మళ్లీ రాజ్ దగ్గర చేసుకుంటున్నాడా? కావ్య మళ్లీ రాజ్ కి దగ్గర అవుతోందా? అని భయపడుతూ ఉంటుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి అక్కడికి వస్తుంది. ఏంటి వదిన.. ఇంత రాత్ర అయినా ఇంకా పడుకోలేదు. నిద్ర పట్టడం లేదా ఇంకా అంటూ అనబోతుండగా నువ్వు ఏదో ఒకటి ఊహిస్తావు కదా అదే అనుకో అంటుంది. దీంతో నాకు నిద్ర పట్టలేదు వదిన. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది అంటుంది. నీ చేతుల్లోకి రాజదండం రావాల్సిందే అంటుంది రుద్రాణి.

రాను రాను నువ్వు ఏకాకివి అవుతున్నావు అనిపిస్తోంది. భార్య నెత్తి మీద అక్షింతలు వేయకుండా వెళ్లిన నీ పుత్రరత్నం మళ్లీ కిందికి తీసుకొచ్చి వేశాడంటే ఏమనాలి. జారుడు బండ మీద ఉన్నాడు నీ కొడుకు అంటుంది రుద్రాణి. నీ కోడలు సామాన్యురాలు కాదు. అందరినీ ఒక ఆట ఆడిస్తోంది. కావ్య చెప్పినట్టే వింటున్నాడు రాజ్ అంటుంది రుద్రాణి. నా కొడుకు అలాంటి వాడు కాదు.. తన అభిప్రాయాన్ని ఎవరి కోసమో మార్చుకోడు అంటుంది అపర్ణ. దీంతో అందుకేనా అక్షింతలు వేసింది అంటూ అపర్ణను రెచ్చగొడుతుంది రుద్రాణి.

ఆ తర్వాత వెళ్లి దేవుడిని మొక్కుకుంటుంది కావ్య. చీకటి అయిపోయింది అనుకున్న నా కాపురంలో వెలుగు వెలిగింది. నా భర్త మారడానికి సమయం అడిగాడు. మారితే బతుకు అంతా వెలుగే కదా. నా భవిష్యత్తు అంతా వెలిగిపోతూనే ఉంటుంది కదా అని దేవుడిని మొక్కుతుంది కావ్య. ఓ పక్క అపనమ్మకం.. మరో వైపు నా భర్త మీద నమ్మకం.. అంటూ దేవుడికి తన గోడును వెళ్లబోసుకుంటుంది కావ్య.

ఆ తర్వాత అదే దేవుడి దగ్గరుకు వెళ్లిన రాజ్.. కావ్య మనసులో ప్రేమను మాత్రం చిగురించకు అంటాడు రాజ్. మా కాపురం కల. అది ఎప్పటికీ నిజం కాదు. నా మనసులో కళావతి ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేదు అంటాడు రాజ్. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే శరణం అంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago