Brahmastra : గత మూడు నాలుగేళ్ళ నుంచి బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న బ్రహ్మాస్త్ర సినిమా గురించి భారీ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో లెజండరీ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, రన్‌బీర్ కపూర్, ఆలియా భట్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు గానీ, అభిమానులు గానీ అంత గొప్పగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్ – ధర్మ ప్రొడక్షన్స్ – ప్రైమ్ ఫోకస్ తో పాటుగా స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు సౌత్ భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.సౌత్ ఇండియాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “నీరు – గాలి – నిప్పు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఓ యువకుడికే తెలియదు. అతనే శివ” అంటూ టాలీవుడ్ లెజండరీ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో నంది అస్త్రంగా టాలీవుడ్ కింగ్ నాగార్జునను చూపించగా.. అగ్ని అస్త్రంగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కనిపించారు. తన ప్రేయసిగా క్రేజీ బ్యూటీ అలియా భట్.. వారికి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కనిపించబోతున్నారు.ఓ వైపు హీరోహీరోయిన్‌ల మధ్య ప్రేమను చూపిస్తూనే.. మరోవైపు దుష్టశక్తుల నుంచి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు రణబీర్ – నాగ్ కలిసి చేసే పోరాటాన్ని ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాఉ మేకర్స్.
మౌనీ రాయ్ ఇందుల్పో నెగెటివ్ రోల్ చేస్తోంది. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ లో విజువల్స్ మరియు వీఎప్ఎక్స్ షాట్స్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళే విధంగా బ్రహ్మాస్త్ర సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ, తాజాగా వచ్చిన ట్రైలర్ చుసిన వాళ్ళు హిందీ వాళ్లకి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అంత సీన్ లేదని, వాళ్ళు ఖచ్చితంగా రాజమౌళి హెల్ప్ తీసుకొని ఉంటారు అంటున్నారు. రాజమౌళి ఏ రేంజులో వీఎఫెక్స్ ఉపయోగిస్తారో ఆయన సినిమాలే చెబుతాయి. కానీ, బ్రహ్మాస్త్రలో ఆయన మార్క్ అసలు కనిపించలేదనే కామెంట్స్ విపిస్తున్నాయి. అంతేకాదు, కొందరు నెటిజన్స్ అయితే, ఈ షాట్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్న రాజమౌళి వీఎఫెక్స్ విషయంలో ఇన్‌వాల్వ్ కాలేదా అని చెప్పుకుంటున్నారు. మొత్తంగా బ్రహ్మాస్త్ర సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుండటం షాకింగ్ విషయం.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.