Karthika Deepam 16 June Today Episode : హిమ, నిరుపమ్ పెళ్లి పనులు ప్రారంభం.. ఈ విషయం తెలిసి జ్వాల షాకింగ్ నిర్ణయం.. తింగరే హిమ అని తెలుసుకుంటుందా?

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 16 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 1380 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనవసరంగా జ్వాల మనసును హిమ డిస్టర్బ్ చేస్తోంది అని అనుకుంటాడు నిరుపమ్. తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇబ్బంది పడిందేమో. తను అప్పుడే చెప్పేసి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటాడు నిరుపమ్. హిమది అతి మంచితనంగా అనిపిస్తోంది. అతిగా జాలి చూపిస్తోందా.. మొదట్లోనే జ్వాలకు అసలు నిజం చెబితే అయిపోయేది కదా. జ్వాలకు నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పడానికి నాకు కుదరట్లేదు. హిమ విచిత్రమైన కోరిక కోరుతోంది. ఏంటో.. నాకు ఇదంతా ఏంటో అర్థం కావడం లేదు అని భోజనం చేయకుండానే ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. తినురా అని అంటుంది స్వప్న. అప్పటి నుంచి తినడం లేదు. ఏం వంట బాగోలేదా అని అంటుంది స్వప్న. వంట అంటే గుర్తొచ్చింది ఆ జ్వాలకు డబ్బులు ఇవ్వు.. హాస్పిటల్ కు పిలిచి డబ్బులు ఇవ్వు అంటాడు సత్యం. దీంతో సరే అంటాడు నిరుపమ్. భోజనం చేసేటప్పుడు అడ్డమైన వాళ్ల గురించి మాట్లాడొద్దని మీ డాడీకి చెప్పు అంటుంది స్వప్న.

Advertisement

karthika deepam 16 june 2022 full episode

కట్ చేస్తే.. జ్వాల.. రవ్వ ఇడ్లీ దగ్గరికి వెళ్తుంది. అవును.. వీడి మీద నాకెందుకు కోపం. ఇక్కడికి నేను రావడం ఎందుకు తగ్గించాను. మోనిత ఆంటి కొడుకు అనే కదా. మోనిత ఆంటి కొడుకుగా పుట్టడం వీడి తప్పు కాదు కదా… అని అనుకుంటుంది. రవ్వ ఇడ్లీ దగ్గరికి వెళ్తుంది జ్వాల. తనను చూసి ఏంటి జ్వాల నువ్వు ఇక్కడికి రావడమే లేదు. నీకోసం మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాను తెలుసా అంటాడు రవ్వ ఇడ్లీ. ఇంతలో తనకు కొన్ని డబ్బులు ఇస్తుంది జ్వాల. ఏంటి జ్వాల డబ్బులు ఇవ్వడానికి వచ్చావా.. డబ్బులు ఇవ్వడానికి తప్ప నన్ను చూడటానికి రావా అంటాడు రవ్వ ఇడ్లీ. దీంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అంటుంది జ్వాల. నువ్వు పెట్టే టీ చాలా బాగుంటుంది. ఒక టీ పెట్టి ఇవ్వవా అంటుంది జ్వాల. దీంతో సరే జ్వాల అంటాడు రవ్వ ఇడ్లీ.

Advertisement

ఈ శోభ కూడా డాక్టర్ సాబ్ ను నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పెట్టదు కదా అని అనుకుంటుంది జ్వాల. నాన్నను మోనిత ఆంటి ఇబ్బంది పెట్టినట్టుగా పెట్టదు కదా అని అనుకుంటుంది జ్వాల. ఇంతలో తింగరి ఫోన్ చేస్తుంది. ఏయ్ తింగరి.. ఏంటి సంగతులు అంటుంది.

దీంతో ఎక్కడున్నావు అని అడుగుతుంది. దీంతో రవ్వ ఇడ్లీని చూడటానికి వచ్చాను అంటుంది జ్వాల. దీంతో ఒకసారి ఆశ్రమానికి రా అంటుంది తింగరి. దీంతో నువ్వే ఇక్కడికి రావచ్చు కదా అంటుంది జ్వాల. దీంతో ఫోన్ కట్ చేస్తుంది తింగరి. ఇంతలో జ్వాల టీ తీసుకో అంటాడు రవ్వ ఇడ్లీ.

నువ్వ రాక రాక వచ్చావు. నీకోసం స్పెషల్ టీ పెట్టాను అంటాడు రవ్వ ఇడ్లీ. మరోవైపు నిరుపమ్ కారులో వెళ్తూ జ్వాల గురించే ఆలోచిస్తుంటాడు. జ్వాలకు నిజం చెప్పకుండా హిమ తప్పు చేస్తోంది అని అనుకుంటాడు నిరుపమ్. మా బావను నేను ప్రేమిస్తున్నానని సూటిగా చెబితే అయిపోయేది కదా.. అని అనుకుంటాడు నిరుపమ్.

ఈరోజు ఎలాగైనా జ్వాలకు చెప్పేస్తాను. చూడు జ్వాల.. నేను హిమనే ప్రేమిస్తున్నాను.. తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తా. ఇదంతా ఎందుకు.. డైరెక్ట్ గా హిమ మెడలో తాళి కట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకొని అక్కడి నుంచి కారులో గుడికి వెళ్తాడు.

Karthika Deepam 16 June Today Episode : హిమను గుడికి పిలిచిన నిరుపమ్

హిమ కూడా గుడికి వస్తుంది. డోర్ తీయ్ అంటాడు నిరుపమ్. ఏమైంది బావ అంటుంది హిమ. దీంతో చెప్పడానికి ఏం లేదు దిగు అంటాడు నిరుపమ్. తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు నిరుపమ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది హిమ. కానీ.. తన మాట వినడు. గుడి లోపలికి తీసుకెళ్లి.. దేవుడి సాక్షిగా తన మెడలో మూడు ముళ్లు వేస్తాడు నిరుపమ్.

దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నువ్వు నా భార్యవు అంటాడు నిరుపమ్. నువ్వు నా అర్ధాంగివి. అంటే నా శరీరంలో సగభాగానివి అంటాడు. ఇక నుంచి నువ్వు నేను ఒక్కటే. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అంటుంది. ఇంతలో శోభ ఉలిక్కిపడుతుంది. అదంతా కల. సోఫాలో నిద్రపోతూ నిరుపమ్, హిమకు పెళ్లి అయినట్టుగా కల కంటుంది శోభ.

నిజంగా హిమను నిరుపమ్.. ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటే.. రహస్యంగా దండలు మార్చుకుంటే ఎలా అని అనుకుంటుంది శోభ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేసి అయినా నిరుపమ్ ను దక్కించుకోవాలి. దానికి ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలి. ఇలా టైమ్ పాస్ చేస్తుంటే ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అని అనుకుంటుంది శోభ.

జ్వాల మీద ఫోకస్ చేయడం కంటే.. హిమను తప్పించి నిరుపమ్ ను ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించడం కరెక్ట్ అని అనుకుంటుంది శోభ. మరోవైపు తనకు ఫోన్ చేసిన హిమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్వాల. అసలు ఆ హిమ ఏమనుకుంటోంది. నాతో ఆటలు ఆడుతోందా అని అనుకుంటుంది జ్వాల.

నా లైఫ్ అంటే దానికి ఆటలా తయారైందా.. ఏంటే హిమ.. నిజంగా నీలో మంచితనమే ఉంటే.. నా మీద కోపమే ఉంటే ఒకసారి ఆటపట్టించాలి కానీ.. ప్రతిసారి ఇలా ఏడిపించడాలు.. పరిగెత్తించడాలు చేయదు కదా. అంటే అది కావాలనే చేస్తుందన్నమాట. నన్ను ఏడిపించానని నానమ్మకు చెప్పిందా. నానమ్మకు తెలిస్తే చూస్తూ తను ఊరుకోదు కదా.. నానమ్మకు తెలిసినా తెలియనట్టు ఏమన్నా నటిస్తోందా అని అనుకుంటుంది జ్వాల.

నానమ్మ ఇలాంటి పనులు చేయదు. నానమ్మకు నటించడం తెలియదు. లాగిపెట్టి ఒకటి ఇచ్చి సీసీ అంటావేంటే.. నానమ్మ అని పిలువు అని అంటుంది. అంటే.. ఆ హిమ.. నేను కనిపించినట్టు నానమ్మకు చెప్పలేదన్నమాట. హిమకు ఎంత పొగరు కాకపోతే నాతో ఆడుకుంటుంది. నాతో ఆటలు ఆడేంత ధైర్యం వచ్చిందా. ఈసారి ఫోన్ చేయనీ.. దాని సంగతి చెబుతాను  అని అనుకుంటుంది.

మరోవైపు నిరుపమ్ వచ్చి.. మమ్మీ డాడీ ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఇద్దరినీ పిలిచి.. హిమకు ఆయుష్షు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ.. నేను హిమను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అయ్యాను అంటాడు నిరుపమ్. ఈ పెళ్లి పనులన్నీ దేనితో మొదలు పెడతారు అంటాడు నిరుపమ్.

దీంతో పెళ్లి పనులు పసుపు కొట్టడంతో ప్రారంభం అవుతుంది అంటుంది స్వప్న. దీంతో హిమ, నిరుపమ్ పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

2 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

4 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago