Viral Video : పెళ్లి కూతురు బుల్లెట్ బండి డాన్స్ ఎన‌ర్జీ మామూలుగా లేదుగా.. అస్స‌లు త‌గ్గ‌ట్లేదు

Authored By mallesh | The Telugu News | Published on: June 30, 2022, 2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ ని ప్ర‌స్తుతం అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ పెళ్లిలో చూసిన పెళ్లి కూతురు, పెళ్లికొడుకు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఒక‌ప్పుడు సిగ్గుప‌డే అమ్మాయిలు ప్ర‌స్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లికొడుకు డ్యాన్స్ చేయ‌డానికి కాస్తా సిగ్గుప‌డుతున్నా పెళ్లికూతురు మాత్రం త‌గ్గేదేలా.. అంటూ తీన్మార్ స్టెప్పుల‌తో అద‌ర‌గొడుతున్నారు. డీజే పాట‌ల‌కు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ బంధువులు, ఫ్రెండ్స్ తో క‌లిసి డ్యాన్స్ చేస్తూ హైలైట్ అవుతున్నారు.

పెళ్లి అన‌గానే ముందుగా డ్యాన్స్ గుర్తుకువ‌చ్చేలా ట్రెండ్ సెట్ చేశారు. ఇక ప్ర‌తిపెళ్లిలో ఎక్కువ‌గా వినిపించే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి.. ఈ సాంగ్ పై క‌చ్చితంగా పెళ్లి కూతురు డ్యాన్స్ చేయాల్సిందే.. భాగ‌స్వామిపై ఉన్న ఫీలింగ్స్ ని ఈ సాంగ్ ద్వార తెలియ‌జేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో సంద‌డి చేస్తున్నారు. చుట్టూ ఎంత‌మంది ఉన్నా ఎలాంటి జంకు లేకుండా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇంటిల్లిపాది అంద‌రూ క‌లిసి డ్యాన్స్ చేస్తూ సంద‌డిగా పెళ్లికే హైలైట్ గా చేస్తున్నారు.

Bride best dance performance bullettu bandi song video

Bride best dance performance bullettu bandi song video

అయితే ప్ర‌స్తుతం ఓ పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫుల్ ఎన‌ర్జీతో బుల్లెట్టు బండెక్కి .. సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. పెళ్లికొడుకు సిగ్గుతో అలా చూస్తూ ఉండిపోయినా ఆమె మాత్రం అస్స‌లు త‌గ్గ‌ట్లేదు.. చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు పెళ్లి కూతురు డ్యాన్స్ కి ఫిదా అవుతున్నారు. కామెంట్స్ చేస్తూ లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=3Fme8aTjNzY

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp