Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఉప్పెన చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. విలేజ్ లవ్ స్టోరీని బుచ్చిబాబు తన టేకింగ్ తో హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి. త్వరలో ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది.
ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు పీరియాడిక్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ కథని సిద్ధం చేసుకున్నారట. కథలో భాగంగా ఎన్టీఆర్ అనేక క్రీడల్లో ప్రావీణ్యం ఉండే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్.. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించాడు. అప్పటి నుంచే ఎన్టీఆర్ తనతో చాలా బాగా మాట్లాడేవారని బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఉప్పెన చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఎన్టీఆర్, బుచ్చిబాబు చిత్రాన్ని కూడా ఆ సంస్థే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడట. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట. ట్రిపుల్ ఆర్ తో ఫ్యాన్స్ కు కిక్కిచ్చిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్టీఆర్ – కొరటాల సినిమా సెట్స్ పైకెళ్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేస్తారు తారక్. నెక్ట్స్ ఉప్పెన బుచ్చిబాబు, సంజయ్ లీలా భన్సాలీ వంటి పేర్లు తారక్ తో కలిపి వినిపిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.